ఫోకస్

పోలవరం చాలా కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సాగునీటి ప్రాజెక్టుల కంటే చాలా కీలకమైనది పోలవరం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును గురించి ‘ఎక్స్‌పిడి’ అనే పదం వినియోగించి పోలవరం త్వరితగతిన పూర్తిచేయాలని పెట్టారు. అంటే నియమ నిబంధనలను పక్కనబెట్టి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చట్టంలోనే పొందుపర్చిన పథకానికి ప్రస్తుతం అతీగతీ కన్పించడం లేదు. ఇప్పటివరకు పోలవరంకోసం ఖర్చు చేసినట్టు ప్రభుత్వం చెబుతోన్న సుమారు రూ.2000 కోట్లలో దాదాపు రూ.1700 కోట్లు పట్టిసీమకే ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు అర్థం లేదు. వెయ్యి టిఎంసిలకు పైగా వాడుకున్నా ఆంధ్రప్రదేశ్‌ను అడిగేవారు లేరు. ఎందుకంటే గోదావరి నదికి ఆఖర వున్నది మనమే కాబట్టి. ఇప్పటివరకు పోలవరంకోసం ఖర్చు పెట్టిన డబ్బును బట్టి చూస్తుంటే.. మరో వందేళ్ళకు కూడా పూర్తికాదు. ఇటీవల రాజ్యసభలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాటలను బట్టిచూస్తే పోలవరం పట్ల ఆసక్తివున్నట్టు కన్పించడం లేదు. సభలో ఒడిస్సా సభ్యుడొకరు వేసిన ప్రశ్నకు సమాధానంగా సుప్రీం కోర్టు ఆపేయమంటే ఆపేస్తామని చెప్పడం చూస్తుంటే ఎంత ఆసక్తి వుందో అర్థం చేసుకోవచ్చు. భారత పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని సుప్రీం ఆపేస్తుందని ఎలా అనగలిగారో మరి. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాలాగే పోలవరం కూడా కేంద్రం పక్కనబెట్టిందనే అనుమానం కలగకమానదు. అది నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుంది. పోలవరం మన జీవన రేఖ. మిగులు జలాలు వున్న ఏకైక నది గోదావరి. నిర్లక్ష్యం చేస్తే నిష్కృతి వుండదు. ఎత్తిపోతల ద్వారా పంపిణీ చేయాలనే ఆలోచన వచ్చిందంటే అది ఆత్మహత్యా సదృశ్యమే. పోలవరం జాతీయ ప్రాజెక్టు, పైగా చట్టంలో పొందుపర్చిన పథకం. సత్వరమే పూర్తి చేయాల్సి వుంది. కేంద్రమే పూర్తి చేయాలని వుంటే రాష్ట్రానికి నాబార్డు రుణం అని అనడమేమిటో అర్థం కావడం లేదు.

-ఉండవల్లి అరుణ్‌కుమార్ మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం