ఫోకస్

కేంద్రంపై ఒత్తిడి తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ లభించేందుకు ఈ రెండు రాష్ట్రాలు కూడా కేంద్రంపై తీవ్రమైన వత్తిడి తీసుకురావలసి ఉంది. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అనేవి బిజెపి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేవు. రాజ్యాంగం ప్రకారం రెండు రాష్ట్రాలకు లభించిన హక్కు ఇది. మన దేశంలో పార్లమెంట్ అత్యున్నతమైంది. పార్లమెంట్ చేసిన చట్టాలు, తీసుకున్న నిర్ణయాలు అమలు కావల్సిందే. వాటికి తిరుగులేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ చట్టం చేసిన సమయంలోనే పార్లమెంట్‌లో ఆనాటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై హామీలను ఇచ్చారు. విభజన చట్టం ఆమోదముద్ర వేసే సమయంలో బిజెపి కూడా పార్లమెంట్‌లో కీలకభూమిక పోషించింది. ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చింది కూడా బిజెపి కావడం గమనార్హం. ఇప్పుడు ఎపికి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు బిజెపి ఎందుకు తటపటాయిస్తుందో అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో టిడిపి భాగస్వామ్య పార్టీగా ఉంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన వత్తిడి తీసుకువచ్చేందుకు బాబుకు అవకాశం ఉంది. కేంద్రంనుండి సానుకూల స్పందన రాకపోతే కేంద్ర ప్రభుత్వం నుండి టిడిపి బయటకు రావాలి. ఆ విధంగా వస్తే టిడిపికి ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. తొలుత ప్రజాస్వామ్య విధానంలో నిర్ణయాలు తీసుకోవాలి. విపక్షాలతో చర్చలు జరిపి, అఖిలపక్షాన్ని కేంద్రప్రభుత్వం వద్దకు, ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్లాలి. అయితే ఆ విధంగా చేసేందుకు చంద్రబాబు చొరవచూపడం లేదు. రాజకీయపరంగా విపక్షాలకు లబ్ధి జరుగుతుందనే ఆలోచనే ఇందుకు కారణంగా భావించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజీకోసం ప్రయత్నించాలి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వేర్వేరు అంశాలపై అఖిలపక్షం సమావేశాలు పెడుతున్నారు. అదేవిధంగా తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాలకు లాభం జరిగేలా ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకోవాలి. వత్తిడి తెస్తే తప్ప కేంద్రం కదిలేట్టు లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేవలం పైపై మెరుగులకోసం ప్రయత్నించకుండా, ఒక పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయాలి. రాష్ట్రాల అభివృద్ధిలో విపక్షాలను కూడా భాగస్వామ్యం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. అందువల్ల ఒకవైపు చంద్రబాబు, మరోవైపు చంద్రశేఖరరావు రాజకీయాలకు తావివ్వకుండా, ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసమే పనిచేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నాను.

- జూలకంటి రంగారెడ్డి, సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాయకుడు