ఫోకస్

నేరచరితులతో రాజకీయాలు అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజరిక పాలన వ్యవస్థలో రాజులు రాజ్యమేలితే..నేరస్తులు నేరాలకు పాల్పడే వారు. ప్రజల తిరుగుబాటుతో రాజులు రాజరికానికి దూరం కాగా, నేరస్తులు నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఇది నాటి పాలన వ్యవస్థ. ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థలో నేరం, రాజకీయం సమాజాన్ని అస్తవ్యస్తం చేసిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఎవరు..ఏం చేస్తున్నారు. ఎవరికి, ఎవరు తెలియని పరిస్థితి. రాజకీయాలు అనేవి ఇంద్రధనుస్సులా మారాయి. 1970 తరువాత రాజకీయాలు, నేరాలు ఉగ్రరూపం దాల్చాయి. నేరం అనేది పెట్టుబడిలేని పని కాగా, రాజకీయాలు అనేవి డబ్బు, నైతిక విలువలతో కూడుకున్నవి. ప్రజలు కూడా వీటిని అనువైతే..ఆచరిస్తున్నారు. కాకపోతే పట్టుబడుతున్నారు. రాజకీయంగా నేరాన్ని ప్రోత్సహించడం, ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడమూ నేరమే. ఈ రెండు అంశాలు సామాన్య ప్రజలకు కూడా ఒంటిబట్టాయి. ఎన్నికల్లో ఏ పార్టీ వారు డబ్బు ఇస్తే వారి వద్ద డబ్బు తీసుకోవడం, ఒకానొక సందర్భంలో అన్ని పార్టీల నేతల వద్ద డబ్బు తీసుకొని పోలింగ్ రోజు ఏదో ఓ పార్టీకి ఓటు వేయడం జరుగుతోంది. దీనికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయాలే కారణమవుతున్నాయి. నేరానికి అలవాటుపడిన నేరస్థులు సైతం రాజకీయ నాయకులను ఆశ్రయించడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలు నేరచరితులతో రాజకీయ సంబంధంగా మారింది. దీంతో నేరస్తులతో రాజకీయ నాయకులకు సంబంధాలుంటాయని చెప్పుకుంటారు. అందుకే నేరచరితులతో రాజకీయాలు అస్తవ్యస్తమయ్యాయి. ప్రస్తుత సమాజం ఆ ఊబిలోనే కూరుకుపోయింది. పస్కలొచ్చిన కళ్లకు అంతా పసుపుగానే కనిపిస్తుందన్నట్టు..ఎవరినైనా ఏ కోణం నుంచి చూస్తే..అదే అనిపిస్తోంది. కాబట్టి నేరాలను, రాజకీయాలతో ముడిపెట్టకూడదు. నేరచరితులతో నేతల సంబంధాలు నైతిక విలువలను దిగాజార్చుతాయి.

-పేర్వారం రాములు రిటైర్డ్ డిజిపి