ఫోకస్

అంబేద్కర్ అప్పుడే చెప్పారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంపై దాడికి దిగనప్పుడల్లా యుద్ధం అనివార్యం అనే వాతావరణం కనిపిస్తుంది. పాకిస్తాన్‌తో యుద్ధం జరగాలని చాలామంది కోరుకుంటున్నా. ఇండియాలానే పాకిస్తాన్ కూడా అణుబాంబు ఉన్న దేశం అని గుర్తించాలి. రెండు దేశాల మధ్య సాంప్రదాయ యుద్ధం జరిగితే భారత దేశమే గెలుస్తుంది. దీనిలో పాకిస్తాన్‌కు కూడా అనుమానం లేదు. ఇండియా తమపై యుద్ధానికి వస్తే మేం అణుబాంబులు ప్రయోగిస్తాం అని పాకిస్తాన్ బహిరంగంగానే ప్రకటించింది. యుద్ధం అంటూ వస్తే ముంబై, ఢిల్లీపై రెండు అణుబాంబులు ప్రయోగించేందుకు పాకిస్తాన్ సన్నాహాలు కూడా చేసింది. యుద్ధం వస్తే మేం నాశనం అవుతాం, దానితోపాటు ఇండియాను నాశనం చేస్తాం అనేది వారి ధోరణి. గతంలో రెండుసార్లు ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. ఈ రెండు యుద్ధాల్లోనూ పాకిస్తాన్ ఓడిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. అప్పుడు రెండు దేశాలకు అణుబాంబులు లేవు. ఇతర దేశాలతో పాకిస్తాన్ సంబంధాలు ఇప్పుడు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు రెండు దేశాలకు అణుబాంబులు ఉన్నాయి. పైగా పాకిస్తాన్ చైనాల మధ్య గట్టి బంధం ఏర్పడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా సైనికులు, చైనా పనివారు వివిధ ప్రాజెక్టుల పనులు చేస్తున్నారు. చైనా నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా రోడ్డు నిర్మిస్తున్నారు. యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్‌కు చైనా అండగా నిలుస్తుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మేం పాకిస్తాన్ స్నేహితులం అని చైనా ప్రకటించింది. గతంలో ఇండియాకు రష్యా గట్టి మద్దతుదారు. వీటో ప్రయోగించి ఇండియాకు అండగా నిలిచేది. ఇప్పుడు రష్యా, చైనా కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ఇండియా విభజన అనివార్యం అని 1941లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన గ్రంథంలో పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక 1951లో పార్లమెంటులోనే అంబేద్కర్ పాకిస్తాన్ నుంచి వచ్చే సమస్యలను ప్రస్తావించారు. జమ్ము, లడక్‌లు ఇండియాలో ఉండాలి. కాశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉంటుందా? పాకిస్తాన్‌లో కలుస్తుందా? అనేది వాళ్లే నిర్ణయించుకునే అవకాశం ఇవ్వాలి. కాశ్మీర్ పేరుతో లక్షల కోట్లు వృధా చేయడం సరైనది కాదు. దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్‌లోని హిందువులను రక్షించే ప్రయత్నం చేయకుండా కాశ్మీర్‌కోసం పోరాడుతున్నారు అని అంబేద్కర్ ఆ రోజే విమర్శించారు. ఈ అంశంలో అంబేద్కర్ చూపించిన మార్గమే సరైనది. అయితే కాశ్మీర్ అంశంపై నిర్ణయం తీసుకునే సమయంలోనే దేశానికి సంబంధించి సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయాలు తీసుకోవాలని మైనారిటీ అనే పదం తొలగించి, భారత దేశంలో భారతీయలు అందరూ ఒకటే అందరికీ ఒకే చట్టం అనే నిర్ణయం తీసుకుంటూ రాజ్యాంగ సవరణ చేయాలి. ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ అనేది ఇండియాకు శాశ్వత సమస్య. మేం యుద్ధానికి సిద్ధం, యుద్ధం చేస్తాం అని ఏ పార్టీ ఎన్ని మాటలు మాట్లాడినా వాస్తవ పరిస్థితి దానికి అనుగుణంగా లేదు. అణుబాంబును తొలుత మేం ప్రయోగించం అని ఇండియా ప్రపంచానికి డిక్లరేషన్ ఇచ్చింది. పాకిస్తాన్ మాత్రం అలా చేయలేదు. ఇక పాకిస్తాన్‌కు వెళ్లకుండా నీటిని ఆపాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది చైనాలో పుడుతుంది. మరి పాకిస్తాన్‌కు మద్దతుగా చైనా కూడా బ్రహ్మపుత్ర నది నుంచి ఇండియాకు నీళ్లు రాకుండా ఆపుతాము అనే అవకాశం ఉంది.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి