ఫోకస్

గట్టి గుణపాఠం చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. పాక్ తీవ్రవాదులు ఇటీవల ఉరీపై దాడి చేసి నిద్దురలో ఉన్న సైనికులను పొట్టన పెట్టుకున్నారు. పాక్ దుశ్చర్యను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే పాక్ దురాగతాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. అందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. ప్రధాని మోదీ వేసే అడుగుపై యావత్ దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటుకకు జవాబు రాయితో ఇవ్వాలి. ఇదే ప్రజలు కోరుకుంటున్నారు. మన దేశ సైనిక స్థావరంపై దాడి చేసినందున, మన సైనికులూ అదే తీరుగా, అదే భాషలో బుద్ధి చెప్పాలి. పాక్ ఇలాంటి ఘటనలతో రెచ్చగొడుతున్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ, ఇతర బిజెపి పెద్దలంతా విమర్శించేవారు. ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి మీ శక్తి ఏమిటో చూపించండి. అందుకు మా సహకారం, దేశ ప్రజల సహకారం ఉంటుంది. ఒకవేళ చూపించలేకపోతే అందుకు కారణాలు ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంది. న్యూక్లియర్ దేశాలు కాబట్టి తొందర పడవద్దని అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా వత్తిడి ఉన్నదా? అనేది కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతినే కోరుకునే వారైతే ఆ దిశగా వేసిన అడుగులు, తీసుకున్న చర్యలు, అంతర్జాతీయ స్థాయిలో తీసుకుని వచ్చిన వత్తిడి ఏమిటో కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలి. పాక్ చర్యలను ఎంతకాలం భరించాలి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో ఒకచోట ముగింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఆ ప్రజల్లో తానూ ఒకరిగా అదే కోరుకుంటున్నాను. దేశ ప్రజలంతా ప్రధాని మోదీ ప్రతీకార చర్యకోసం ఎదురు చూస్తున్నారు. లోగడ పఠాన్‌కోట్‌పై దాడి జరిగినప్పుడూ జవాబు చెప్పలేకపోయారు. నవాజ్ షరీఫ్ వద్దకు వెళ్ళి ‘్ఛయ్’ తాగుతారు. పిలువకుండానే ఆ దేశాన్ని సందర్శిస్తారు. ఇటువంటి వాటితో ప్రజల్లో నెలకొన్న అపొహలను తొలగించాల్సిన అవసరం ప్రధాని నరేంద్ర మోదీపై ఉంది.

- మహ్మద్ షబ్బీర్ అలీ తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేత