ఫోకస్

ఉగ్రవాదానికి విరుగుడేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదం ఏ దేశానికీ కొత్త కాదు, చివరికి అగ్రరాజ్యాలు సైతం ఉగ్రవాద పంజాకు బలి అయినవే. రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం వెర్రితలలువేస్తూ పెనుభూతంగా మారుతోంది. ఒకవైపు సామ్రాజ్యవాదం మరోవైపు ఉగ్రవాదం భౌగోళిక సరిహద్దులు దాటి విస్తరించుకుపోతున్నాయి. ఏదో ఒక పేరుతో తీవ్రమైన కాంక్షతో రగిలిపోతున్న యువతను మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుని ఉగ్రవాదులుగా తీర్చిదిద్దుతూ ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజూ విధ్వంసానికి, హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ భయోత్పాతమే తమ అతిపెద్ద ఆయుధంగా ఉగ్రవాదం విస్తరించిపోతోంది. భయాన్ని కలుగజేయడం, అపాయం కలుగజేయడం, ఆత్మన్యూనతా భావాన్ని ఎత్తిచూపడం, భయపెట్టి తమ పంతాన్ని నెగ్గించుకోవడం, సమాజ వ్యతిరేక మార్గాలను ఎంచుకోవడం ద్వారా ఉగ్రవాదులు తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నారు. మానసికంగా ఇదో రుగ్మత, సామాజికంగా చూస్తే ఇదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా లక్షలాది మంది అమాయకులైన ప్రజలు, దేశాధినేతలు, ప్రముఖులు బలవుతున్నారు. ఢిల్లీలో పార్లమెంటుపై దాడిసహా, తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కదలికలు కొత్త కాదు, మక్కా మసీదు, గోకుల్ చాట్, లుంబినీ పార్కులో ఉగ్రవాదులు బాంబులు పేల్చిన ఘటనలు, దిల్‌సుఖ్‌నగర్‌లో సాయిబాబా ఆలయంలో భక్తులను హతమార్చేందుకు చేసిన పన్నాగాలు ఇంకా జనం మదిలో నుండి తొలగిపోలేదు. అన్ని దేశాల్లో ఉగ్రవాదలు ఏదో ఒక రూపంలో హింసను ప్రేరేపిస్తూనే ఉన్నారు. ఇస్తాంబుల్, ఢాకా, బాగ్దాద్, సౌదీ అరేబియా, పారిస్, తాజాగా కాశ్మీర్‌లోని ఉరీలో ఉగ్రవాద పంజా తెలిసిందే. ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో ఉగ్రవాదం మారణకాండకు పాల్పడుతోంది. పాక్ కేంద్రంగానే 330 ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో దాదాపు 10 సంస్థలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సంస్థలని ఐక్యరాజ్య సమితి సైతం నిర్ధారించింది. లష్కర్ ఇ తొయిబా, ఇండియన్ ముజాహిద్దీన్, ఆల్‌ఖైదా, ఐసిస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంస్థల జాబితా చేంతాడంత ఉంటుంది. ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారిలో చాలావరకూ ఉన్నత విద్యను అభ్యసించిన వారూ ఉన్నారు. బంగ్లాదేశ్ ఉగ్రవాదం వల్ల ఇద్దరు దేశాధినేతలను పోగొట్టుకుంది. అలాంటి అనుభవాలే ఆసియా దేశాల్లో ఉన్నాయి. ప్రతిసారీ ఉగ్రవాద ఘటనలు జరిగినపుడు ప్రపంచం అంతా ఉలిక్కిపడటం, హడావుడి నిర్ణయాలు తీసుకోవడం, తాత్కాలికంగా కొన్ని ఘటనలు ఆగినా, విరామం తర్వాత మరో ఘటన జరగడం షరా మామూలైపోయింది. ఉగ్రవాద మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటనేది ఎప్పటికపుడు చర్చనీయాంశమే. ఉగ్రవాదానికి మూలం ఎక్కడో ఉంటే ప్రభుత్వం ఏం చేయాలనే ప్రశ్న తలెత్తుతోంది.
తాజాగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలతో దేశప్రజల్లో కొత్త నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించారు. నాగరిక సమాజం, అభివృద్ధి వైపు, నూతన భావజాలం వైపు పయనిస్తుందని చెప్పుకుంటున్నా ఉగ్రవాద పురోగమనంతో అది దారుణంగా విఫలమవుతోంది. ఐక్యరాజ్య సమితి సైతం ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా నిర్మూలించాలో అనే అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఉగ్రవాద సవాలును స్వీకరించాల్సిందే, అప్రమత్తం కావల్సిందే, అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్ష ప్రజల చైతన్యమే కావల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ అంశంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.