ఫోకస్

శత్రువుపై దాడికి ప్రచారం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశాన్ని నష్టపరచాలని, దేశంలో అశాంతి నెలకొల్పాలన్న ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి తీవ్రవాదులు భారత్‌పై దాడులు చేస్తుంటే, వారికి సరైన బుద్ధి చెప్పాల్సిందే. భారత్‌లో అశాంతి నెలకొల్పేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రవాదులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. తీవ్రవాదులు భారత్ భూభాగంలోకి అక్రమంగా వస్తూ దాడులు చేస్తున్నారు. భారత సైన్యం ఎదురుదాడి చేయడం మంచిదే. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి. భారత సైన్యం చేసే ఈ ఎదురుదాడిపై ప్రచారం చేయకపోవడమే మంచిది. ఏ రాజకీయ పార్టీ కూడా తీవ్రవాదాన్ని సమర్థించదు. త్వరలో నాలుగైదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందువల్ల, పాక్‌లోని తీవ్రవాదులపై జరిగిన ‘సర్జికల్ దాడుల’ను రాజకీయ లబ్దికోసం ఎన్‌డిఎ ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. అందుకే ఈ దాడులకు విపరీతమైన ప్రచారం ఇచ్చారు. అంతర్జాతీయంగా పరిస్థితి ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్‌కు అమెరికా ఆయుధాలను సమకూరుస్తోంది. పాకిస్తాన్‌లో అమెరికా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఈ చర్య దక్షిణాసియాలో అశాంతికి కారణమవుతోంది. పాక్‌తో శత్రుత్వం ఉన్న బెలూచిస్తాన్‌తో మన దేశం మైత్రిని నెలకొల్పుకుంటోంది. దాంతో పాకిస్తాన్ సహజంగానే మనదేశంపై ఆగ్రహంగా ఉంటోంది.
తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న తోడ్పాటును ప్రపంచ దేశాలకు భారత్ వివరించగలగాలి. పాకిస్తాన్ ఏ విధంగా తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తుందో వివరించగలగాలి. ఇందుకు ఓర్పుతో భారత ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంది. పాక్ తీవ్రవాదులు వినాశనానికే ఒడిగడుతున్నారు. మన దేశం విధానం వేరు. మనం జీవించాలి.. ఎదుటివారు శాంతిగా జీవించాలన్నదే మనదేశం సిద్ధాంతం. అందుకే పాక్ రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకుండా దౌత్యపరంగా పాకిస్తాన్‌ను ఏకాకిని చేసి అంతర్జాతీయ వేదికల్లో దోషిగా నిలబెట్టాలి. దానివల్ల సత్ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర ప్రజలకోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగంలోని 371 ఆర్టికల్‌పై పునరాలోచన చేస్తామని బిజెపి చేసిన ప్రకటన శాంతి, భద్రతలకు విఘాతం కల్పించింది. బిజెపికి చెందిన కొంతమంది మంత్రులు ముస్లింలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జమ్మూ-కాశ్మీర్ నుండి ఇతర ప్రాంతాలకు వలసపోయిన కాశ్మీరీ పండితుల విషయంలో 2014 ఎన్నికల సమయంలో బిజెపి వాగ్దానం చేసింది. బిజెపి గెలిస్తే వలసపోయిన కాశ్మీరీ పండితులు తిరిగి వారి జన్మస్థలాలకు చేరుస్తామన్నది ఈ హామీ. గత రెండేళ్లలో ఈ హామీ నెలబెట్టేందుకు ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రయత్నించింది. 500కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. కొంతమంది కాశ్మీరీ పండితులను తిరిగి వారి వారి స్వస్థలాలకు తీసుకువచ్చింది. దాంతో గతంలో జరిగిన అలజడి తరహాలోనే కాశ్మీర్‌లోని ఒక వర్గం మళ్లీ అలజడి చేపట్టింది. అందుకే శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా పనిచేయాలి.

- కె. నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి