ఫోకస్

శాస్ర్తియత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటు శాస్ర్తియంగా లేదు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో అధికారపక్షం, విపక్షాలు, స్వచ్ఛందసేవా సంస్థలు, ప్రజలు తదితరులంతా భాగస్వామ్యులే. ప్రభుత్వం తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయంలో గోప్యత అవసరం ఏముంటుంది. సినిమాల తరహాలో చివరిక్షణం వరకు ఉత్కంఠ కలిగించారు. పరిపాలనలో ఇలాంటివి అవసరం లేదు.కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మేము (విపక్షాలు) ఎన్నోసార్లు డిమాండ్ చేయగా ఒక పర్యాయం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారు. మా పార్టీ (సిపిఎం)తోసహా అన్ని రాజకీయ పార్టీలు ఆ సమావేశంలో అభిప్రాయాలను వెల్లడించాం. మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, ప్రభుత్వం తరఫున ఒక ప్రణాళిక రూపొందించి, మరొక పర్యాయం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు మరొక పర్యాయం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్ అలాంటి సమావేశం ఏమీ ఏర్పాటు చేయలేదు. శాసనసభలో బలం ఉందని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధం. కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్ర్తియత లేదనడానికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఒక ఉదాహరణ. నల్లగొండ పాత జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మిర్యాలగూడ ముఖ్యమైనది. అన్ని అర్హతలున్న మిర్యాలగూడాను వదిలేసి నల్లగొండను మూడు ముక్కలుగా అశాస్ర్తియంగా విభజించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను, కొంతమంది వ్యక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని స్పష్టమవుతోంది. ప్రజల అభిప్రాయాలకు ప్రజాస్వామ్య ప్రభుత్వం విలువ ఇవ్వాల్సి ఉంది. పరిపాలనకు జిల్లా పెద్దదా, చిన్నదా అన్నది ముఖ్యంకాదు. ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారో, వౌలిక వసతులు ఏ విధంగా కల్పిస్తున్నారో, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు ఏ విధంగా జరుగుతుందో అన్న అంశాలు ప్రధానమైనవి. ‘ఇల్లలకగానే పండగ కాదు’ అన్నది తెలుగులో సామెత. జిల్లాలు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం పని పూర్తికాలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిని అవసరమైన మేరకు నియమించాలి. ఖాళీలను భర్తీచేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి.

- జూలకంటి రంగారెడ్డి సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాయకుడు