ఫోకస్

చెల్లింపులో నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీయింబర్స్‌మెంట్ పట్ల ప్రభుత్వానికి ఎంతమాత్రం నిర్లక్ష్యం తగదు. దీనికంటే ప్రాధాన్యత కలిగింది మరొటి ఉండదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల కోసం అన్నింటినీ పక్కనపెట్టాలి. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కెజి టు పీజి వరకు ఉచిత విద్యను అందిస్తానని ఎన్నికల ప్రణాళికలో చేర్చిన పార్టీ ఇది. అలాంటిది విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులపట్ల ఇంత అలసత్వం కానీ, నిర్లక్ష్యం కానీ ఎందుకు అనుసరిస్తోందో అర్థం కావడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆగిపోతే పేదవాడి చదువు ఆపేసినట్టే. వృత్తి విద్యా కోర్సులను అభ్యసించే పేద విద్యార్థులకోసం ప్రవేశపెట్టిన పథకం ఇది. నూటికి 70 శాతం మంది విద్యార్థులు ఈ కోర్సులను అభ్యసించేవారిలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్‌లమెంట్ మీదనే ఆధారపడి నడిచే కాలేజీలు కూడా దాదాపు ఇదే శాతంలో ఉంటాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎప్పటికప్పుడు క్లియర్ చేయకపోతే కేవలం విద్యార్థులకు మాత్రమే సమస్య ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ బయటికి తెలియని విషయం మరొకటి ఉంది. ప్రైవేట్ విద్యాసంస్థలలో లెక్చరర్లుగా, ప్రొఫెసర్లతోపాటు ఇతర బోధనా, బోధనేతర సిబ్బంది నూటికి నూరు శాతం మంది నిరుద్యోగులే. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఉద్యోగాలు దొరక్క ప్రైవేట్ విద్యాసంస్థలో వీరు పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీయింబర్స్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు చెల్లించని పక్షంలో వీరికి యాజమాన్యాలు వేతనాలు చెల్లించవు. ఒకవైపు విద్యార్థులు, మరోవైపు బోధనా, బోధనేతర సిబ్బంది జీవితాలతో ముడిపడిన అంశం ఇది. అన్నింటినీ పక్కనపెట్టి రీయింబర్స్‌మెంట్‌చేయకపోతే విద్యావ్యవస్థ సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. అలాగని ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న కాలేజీలన్ని చక్కగా పని చేస్తున్నాయని చెప్పలేం. ఇందులో కూడా కొన్ని సంస్థలు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ నిధులు కాజేసే సంస్థలు కూడా ఉండవచ్చు. అలాంటి సంస్థల పట్ల అప్రమత్తంగా ఉంటూనే విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చెల్లింపు ప్రక్రియను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.

- రాజ్‌సిద్ధార్థ, రిటైర్డు ప్రొఫెసర్ కాకతీయ మెడికల్ కాలేజీ