ఫోకస్

చెల్లింపులు జరుగుతున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి బకాయిలు వారసత్వంగా వస్తూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆరువేల కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండేవి. ఏటా 2500 కోట్ల రూపాయల వరకు కేటాయంపులు ఉండేది. దానిలో సగం చెల్లించడం సగం, అలానే పేరుకుపోవడం జరుగుతోంది. తెలంగాణలో మూడు వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉండగా, వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించారు. మిగిలిన రెండువేల కోట్ల రూపాయలను దశల వారిగా చెల్లింపులు చేస్తున్నారు. రెండు రోజుల్లో మూడు వందల కోట్లు, ఈనెలాఖరునాటికి మరో మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిషన్ కాకతీయ, భగీరథ, ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించడం, పనులు వేగంగా జరుగుతుండడం వల్ల వాటికి నిధులు విడుదల జరిగింది. తెలంగాణ ముమ్మాటికీ సంపన్న రాష్టమ్రే, కాబట్టే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టుల నిర్మాణానికి ఏటా 25వేల కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ మేరకు పనులు జరుగుతున్నాయి. దీనివల్ల రీయింబర్స్‌మెంట్‌కు కొంత ఆలస్యం అయింది. అయితే పాత బకాయిలను సైతం చెల్లిస్తున్న విషయం గుర్తించాలి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది కాబట్టే కేంద్రం అదనంగా అప్పు చేసేందుకు అవకాశం కల్పించింది. దీనివల్ల దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వరకు నిధులు వస్తాయి. వీటితో రైతులకు రుణమాఫీతో పాటు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు అందుబాటులోకి వస్తాయి. పాత బకాయిలు తీర్చడానికి అవకాశం ఏర్పడుంది. విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలిసిందే. రాష్ట్రంలో 119 రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రారంభించుకున్నాం. కేజీ టూ పీజీ ఉచిత విద్యపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి అమలు చేయాలనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించి చేతులు దులుపుకోవడం కాదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కోసం కాలేజీలు అనే ధోరణి కాకుండా నాణ్యతతో కూడిన విద్య అందించే విధంగా ఇంజనీరింగ్ కాలేజీల ప్రమాణాలు పెరిగే విధంగా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. విద్యార్థుల్లో నైపుణ్యంకోసం తీసుకున్న చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. విద్యా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా నాణ్యమైన విద్యకోసం ప్రభుత్వం కృషి చేస్తోంది.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ