ఫోకస్

మత వ్యవహారాల్లో జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామన్ సివిల్ కోడ్ వల్ల మత సంప్రదాయాల్లో జోక్యం చేసుకున్నట్లవుతుంది. బిజెపి ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ అంశాన్ని తైరపైకి తెచ్చింది. ఈ అంశంపై చర్చ మంచిదే. కాని ముస్లిం మత సంస్థల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెత్తు పోకడలతో కేంద్రం వ్యవహరిస్తున్నట్లు కనపిస్తోంది. ఇది అప్రజాస్వామికం. స్వాతంత్య్రం వచ్చినప్పుడు అప్పటి రాజ్యాంగ నిర్మాతలు కామన్ సివిల్ కోడ్ రూపొందించి అమలు చేయడంలో దూరదృష్టితో వ్యవహరించారు. ముస్లిం వర్గాలను లక్ష్యంగా చేసుకుని బిజెపి పార్టీ కామన్ సివిల్ కోడ్‌పై చర్చకు తెరలేపింది. ఆయా మతాల వివాహాల సంప్రదాయాలను ప్రభుత్వం శాసించరాదు. హైందవ సమాజంలో కూడా ప్రాంతాన్ని బట్టి వివాహాలు, విడాకుల సంప్రదాయాలు అమలవుతున్నాయి. ఏ కోర్టు అయినా ముందు దంపతులు కలిసి ఉండాలని కోరుకుంటుంది. అంతేకాని బలవంతంగా కాపురం చేయించ లేదు. ప్రస్తుతం తమకు అన్యాయం జరిగితే మతాలకు అతీతంగా మహిళలు కోర్టుకు వెళ్లి న్యాయం పొందుతున్నారు. పాకిస్తాన్‌లో ముస్లిం పర్సనల్ లా బోర్డు లేదని, దేశానికి అంతా ఒకటే కోడ్ ఉందని, మూడుసార్లు తలాక్ పద్ధతి లేదంటారు. మనం అన్ని విషయాల్లో ఇతర దేశాల చట్టాలను ఆదర్శంగా తీసుకోవాలా? దుబాయ్, సౌదీ అరేబియా దేశాల్లో చట్టవ్యతిరేకమైన పనికి పాల్పడితే శిరచ్చేదం లాంటి తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. మన దేశంలో అవినీతికి పాల్పడిన వారికి ఈ తరహా శిక్షలు వేస్తున్నామా? ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక, భిన్నమైన మతాలు, సంస్కృతులున్న దేశం మనది. కేంద్రం అన్ని వర్గాల్లో పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేయాలి. సమాజంలో వివిధ మతాల వారికి ఆందోళన కలిగించే చర్చలకు స్వస్తి చెప్పాలి. ముస్లింలలో మెజార్టీ వర్గాల డిమాండ్లను కేంద్రం వినాలి. ఏకపక్ష నిర్ణయాలవల్ల సమాజంలో అశాంతి ఏర్పడుతుంది.

- ఎస్ సలాం బాబు అధ్యక్షుడు, ఏపి వైకాపా విద్యార్థి సంఘం