ఫోకస్

చట్టబద్ధమైన ఫోరం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ విద్య పట్ల యువతలో రోజురోజుకీ మక్కువ పెరుగుతోంది. ఇది ఎవరికి ఎంతవరకు ఉపయోగమనేది ఎలా ఉన్నా, ఆశించేవారికి మాత్రం నష్టం జరగకూడదు. విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళుతున్న ప్రతి విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని, విదేశాల్లో ఆ విద్యాసంస్థ లేదా యూనివర్శిటీ ఉన్నదీ లేనిదీ ఇక్కడే తనిఖీ చేయాలి. అందుకోసం ఒక వ్యవస్థ లేదా ఫోరమ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయాలి. ఆ విదేశీ విద్యా సంస్థకు సంబంధించిన అన్ని వివరాలను ఇక్కడ అందుబాటులో ఉండాలి. విదేశీ విద్యకోసం విదేశాలకు పరుగులు తీసే విద్యార్థులు సైతం కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆ విశ్వవిద్యాలయం గుర్తింపు ఉన్నదా లేదా లోతుగా పరిశీలించాలి. అసలు ప్రభుత్వమే అటువంటి విదేశీ విద్యాసంస్థలను మన దేశంలో ఏర్పాటు చేసే విధంగా కృషిచేస్తే మంచిది. విదేశీ విద్యకోసం వెళుతున్న విద్యార్థులను తిప్పిపంపడం వల్ల ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆవేదనకు గురవుతారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. విదేశాల్లో భారతదేశ విద్యార్థులంటే చిన్నచూపు చూడ్డం మొదటినుంచీ ఉంది. ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ముఖ్యంగా కన్సల్టెన్సీలు పెద్దఎత్తున పుట్టుకువస్తున్నాయి. విదేశీ విద్యకోసం పంపించే కనె్సల్టెన్సీలను నియంత్రించాలి. విదేశీ విద్యపట్ల ప్రభుత్వం మంచి విధానపరమైన నిర్ణయాన్ని కలిగి ఉండాలి. కన్సల్టెన్సీలకు గుర్తింపు ఉందా, అవి మోసపూరితమా, లేక సక్రమమైనవా అనే అంశంపై విచారణ జరగాలి. ప్రభుత్వం గుర్తింపు వారా వీటిని క్రమబద్ధీకరించాలి. ప్రభుత్వ నియంత్రణలోకి రావాలి. ఒక్కోసారి కన్సల్టెన్సీ అంశం పెద్దగా పట్టించుకోరు. దానివల్ల విద్యార్థులు నమ్మి మోసపోతుంటారు. ఇలాంటి వాటి విషయంలో విద్యార్థులు సైతం ముందు వెనుక ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ విద్యపట్ల పూర్తి అవగాహన ఉండాలి. ఇటు ప్రభుత్వం, అటు విద్యార్థులు కూడా లోతైన అవగాహనతో ముందుకెళ్లాలి. మరోసారి తెలుగు విద్యార్థులు ఎవరూ ఇలా వెనక్కి రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.

- కె.రామకృష్ణ, సిపిఐ, ఎపి రాష్ట్ర కార్యదర్శి