ఫోకస్

మన ప్రయోజనాలకు భంగం కలుగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ దేశాలను శాసించే అమెరికా అధ్యక్షుడుగా ఎవరు గెలిచినా అక్కడ స్థిరబడ్డ లేదా వేర్వేరు విధులు నిర్వర్తించే ఎన్‌ఆర్‌ఐలకు, భారతదేశ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లబోదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరితోనైనా సత్సంబంధాలు కొనసాగిస్తారు. అలాంటి శక్తియుక్తులు వారికున్నాయ. అయితే ఎన్‌ఆర్‌ఐలకు, హిల్లరీకి మధ్య అనాదిగా సత్సంబంధాలున్నాయి. ఎన్‌ఆర్‌ఐల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం మొదటి నుంచి కూడా హిల్లరీ చేయూతనిస్తున్నారు. అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలు... ముఖ్యంగా తెలుగువారు అధికంగా ఉన్నారు. అక్కడ అన్ని రంగాల్లోను స్థిరపడ్డవారు నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. డిజిటల్ పాఠశాలల ఏర్పాటుకు తమ వంతుగా 30 శాతం ఖర్చు భరిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు వందల కోట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వారి బాగోగులు చూసుకుంటూ అన్నింటా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కోమటి జయరాంను అమెరికాలో ప్రత్యేక సలహాదారుడిగా నియమించటమేగాక మన దేశంలో వారికి సహాయపడేందుకుగాను ప్రత్యేక కమిటీ కూడా అధికారికంగా ఏర్పాటు చేశారు.

- పల్లె రఘునాథరెడ్డి సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి