ఫోకస్

తిప్పలు తప్ప.. ఏమి సాధించినట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోట్లను రద్దు చేసి ప్రధాని నరేంద్ర మోదీ పేదలను బిక్షగాళ్ళుగా చేశారు. పేదలు, చిరు వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ వద్ద ఉన్న డబ్బులను మార్చుకోవడానికే బ్యాంకులు, పోస్ట్ఫాసుల వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. వారికి అప్పనంగా ఆ డబ్బులు రాలేదు. వారి కష్టార్జితం. కష్టపడి సంపాదించిన డబ్బును సద్వినియోగం చేసుకోవడానికే మరింత కష్టపడాల్సి రావడం దురదృష్టకరం. పైగా అనేక ఎటిఎంలు పని చేయడం లేదు. మరికొన్ని ఎటిఎంల వద్ద అవుట్ ఆఫ్ ఆర్డర్, నో-కరెన్సీ అని బోర్డులు వేలాడుతున్నాయి. ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం వద్ద దేశంలో వంద కోట్ల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలామణిలో ఉన్న అన్ని రకాల నోట్లలో 85 శాతం ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసే ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అకస్మాత్తు నిర్ణయంతో అప్పటికే సుదూర ప్రాంతాల పర్యటనలో ఉన్న వారి వద్ద ఉన్న నోట్లు పనిచేయక, ఎటిఎంలలో డబ్బులు లేక వారి బాధలు వర్ణనాతీతం. దీనికి ఎవరు బాధ్యులు? అవివేకంతో నిర్ణయం తీసుకుని ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. పైగా ప్రజలు కష్టపడుతుంటే ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్ళడం విచారకరం. ప్రధాని మోదీ తనకు అనుకూలంగా ఉన్నవారికి ముందుగానే ఈ సమాచారాన్ని చెప్పి అప్రమత్తం చేశారన్న ప్రచారం బాగా జరుగుతున్నది. అందుకే వారు ఎవ్వరూ బ్యాంకుల వద్ద బారులు తీరలేదు. నల్లధనాన్ని అరికట్టే నెపంతో పెద్దనోట్లను రద్దు చేసినప్పుడు 2 వేల రూపాయల నోట్లను మళ్లీ మార్కెట్‌లోకి ఎందుకు ప్రవేశపెడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇకనైనా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని వెంటనే సరైన నిర్ణయం తీసుకోవాలి.

- కూరపాటి శ్రీనివాస రాజు వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ సెటిలర్ల ఫోరం