ఫోకస్

పేద ప్రజల పాలిట శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నఫళంగా 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పేదల పాలిట శాపంగా మారింది. ధనవంతులు, బ్లాక్‌మనీ ఉన్నవాళ్ళు ముందుగానే జాగ్రత్త పడినట్లు వార్తలు వస్తున్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అకస్మాత్తు నిర్ణయాలవల్ల అనర్థాలు సంభవిస్తాయి. ఏమి ఘనకార్యం సాధించాలని ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదుకానీ, సామాన్యులు నలిగిపోతున్నారు. 2వేల రూపాయల నోట్లను మార్కెట్‌లోకి తేవడం అంటే దోచుకుని వారికి మరింత సులభం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఎంత పెద్ద నోట్లను చలామణిలోకి తెస్తే అంత పెద్దఎత్తున బ్లాక్ మనీని ప్రోత్సహించడమే అవుతుంది. పెద్దనోట్ల రద్దు సంగతి బిజెపి, టిడిపి నేతలకు ముందే తెలుసునని అందుకే వారిలో టెన్షన్ కనిపించడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు తమ సొంత పనులను, ఉద్యోగ, ఉపాధి పనులను పక్కన పెట్టి బ్యాంకులు, పోస్ట్ఫాసుల వద్ద ‘క్యూ’లో గంటల తరబడి నిలబడాల్సి వస్తున్నది. గతంలో నోట్ల మార్పిడి జరిగిన దాఖలాలున్నాయి. కానీ ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం అనేది ఎప్పుడూ జరగలేదు. దీంతో వాణిజ్య, వ్యాపారాలు 60 శాతం పడిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం 40 శాతం పడిపోయింది. చిన్నాచితకా వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు నష్టపోయారు. అందుకు కారణం ప్రజల కొనుగోళ్ళు తగ్గిపోయాయి. కొనుగోలుదారుల వద్ద చిల్లర డబ్బులు లేకపోవడంతో వారు కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులూ కొనడం తగ్గించారు. ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం వల్ల పేద, సామాన్య ప్రజలకు భారీగా నష్టం వాటిల్లింది.

- చాడ వెంకట రెడ్డి కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర సమితి