ఫోకస్

ప్రజల్లో అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెయ్య, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికార పార్టీకి చెందినవారు ఈ అంశంపై ప్రజలను చైతన్యవంతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కేంద్ర నిర్ణయంపై పూర్తి అవగాహన కల్పించాలి. ఐటి శాఖ దాడిచేస్తుందనో, పేదలు, మధ్యతరగతి ప్రజల వద్ద ఉన్న డబ్బును ప్రభుత్వం లాగివేసుకుంటుందనో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. రైతులు తమ పంటలపై వచ్చిన ఆదాయంపై, భూములు విక్రయించగా వచ్చిన ఆదాయంపై ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రైతుల ఆదాయం 2.50 లక్షలకు పరిమితం ఏమీ కాదు. వ్యవసాయ రంగం నుండి వచ్చే ఆదాయం ఎంతైనా రైతులకు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. రైతులు తమ ఆదాయాన్ని నిరభ్యంతరంగా బ్యాంకు ఖాతాల్లో జమచేసుకోవచ్చు. ఇతర రంగాల నుండి ప్రభుత్వానికి పన్నులు యథాతథంగా వస్తాయి. రెండుకోట్ల టర్నోవర్ ఉన్న వారు, సంస్థలు కేవలం 8 శాతం పన్నుగా చెల్లిస్తే, వారు లెక్కలు నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ప్రభుత్వం చిన్న, మధ్యతరహా వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలకు ఎంతో వెసులుబాటు కల్పించినట్టయింది. దేశవ్యాప్తంగా 500,, 1000 రూపాయల నోట్లు 14.85 లక్షల కోట్ల రూపాయలు చలామణిలోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత గత పధ్నాలుగు రోజుల్లో 8 నుండి 9 లక్షల కోట్ల రూపాయల వరకు బ్యాంకుల్లోకి డిపాజిట్లుగా వచ్చాయి. మరికొంత సమయం ఉండటం వల్ల పూర్తి వివరాలు మరో 45 రోజుల్లో వెలుగులోకి వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి పరిశీలిస్తే ఐదు లక్షల కోట్లు మురిగిపోయే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ డబ్బును ఇప్పటివరకు ఎవరూ వెల్లడించలేదు. ఈ విధానం ఆర్‌బిఐకి లబ్దిచేకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు డివిడెండ్ ఇస్తుంది. నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది. దాంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బడ్జెట్‌లో లోటు తగ్గిపోతుంది. దాంతో ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుండి అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వానికి పన్నుల వసూళ్లు పెరుగుతాయి. ప్రస్తుతం సామాన్యులు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు నెలరోజుల్లో తొలిగిపోతాయి. బ్యాంకుల నుండి డబ్బు తీసుకునే అవకాశాన్ని వృద్ధులకు, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోలేని వారికి వదిలివేయడం మంచిది. కాస్తో కూస్తో చదువుకున్నవారు ఆన్‌లైన్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ విధానాన్ని వినియోగించుకోవాలి. వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి. యువతకు వ్యాలెట్ విధానం పర్స్‌లాగా ఉపయోగపడుతుంది. దుకాణాల్లో కొనుగోలు చేసే సరకుకు సంబంధించి మొబైల్ ఫోన్ నుండి ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించే విధానాన్ని అమలు చేయాలి. యూనిఫైడ్ పేయింగ్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం (యుపిఐఎస్) ను కేంద్రం అమల్లోకి తీసుకువచ్చింది. లక్ష రూపాయలవరకు ఈ విధానంలో పేమెంట్ చేసుకోవచ్చు. చెక్కులు, నెఫ్ట్ విధానాన్ని పూర్తిస్థాయిలో వాడాలి. ఈ విధానాల వల్ల బ్యాంకులపై చాలా భారం తగ్గిపోతుంది.

- కె. నర్సింహమూర్తి ఆర్థిక నిపుణులు