ఫోకస్

ఎవరికీ నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నెలకు రెండు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌కు ఫిర్యాదు చేశారన్న విషయం అవాస్తవం. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకే నేను కూడా గవర్నర్‌ను కలిశా, అసలు పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి నష్టం వస్తుందన్న విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ చెప్పారు. పెద్ద నోట్లను ప్రధాని నరేంద్రమోదీ రద్దు చేసిన తర్వాత జరిగిన లావాదేవీలు పరిగణనలోకి తీసుకుని నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం రావడం సరికాదు. దేశం మొత్తం మీద బ్యాంకింగ్ మయం కావాలి. 150 పథకాలకు కేంద్రం నిధులు నేరుగా రాష్ట్రాలకు వస్తాయి. ఇక మీదట కరెన్సీ వాడకం తగ్గించి, వర్చ్యువల్ కరెన్సీ వాడకం పెరుగుతుంది. నల్ల ధనం ప్రభావం దేశవ్యాప్తంగా హెచ్చుగా ఉందనే పెద్దనోట్లను ప్రధాని రద్దు చేశారు. నోట్ల రద్దు పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఒక రాష్ట్రంతో ఆ అంశాన్ని ముడిపెట్టి మాట్లాడటం చౌకబారుతనమే అవుతుంది. వాస్తవానికి నల్లధనానికి కళ్లెం వేసేందుకే కేంద్రప్రభుత్వం 500, 1000 రూపాయిల నోట్లను రద్దుచేసింది. నోట్ల రద్దుతో ఏ రాష్ట్రానికి అయినా నష్టం వాటిల్లినట్టయితే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లితో సమావేశమై ఆ అంశాలపై చర్చించడం జరుగుతుంది. నల్లధనానికి కళ్లెం వేయడానికి అపూర్వమైన ప్రధానచర్యను తీసుకున్నా రెండు సంవత్సరాల క్రితమే 2014 మే నెలలో అధికారంలోకి వచ్చినపుడు దీనికి పునాది వేశారు. ప్రస్తుత ఆర్థిక చర్య ఇదివరకు ఎన్నడూ జరగనిది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరిపిన మొదటి మంత్రివర్గ సమావేశంలోనే నల్లధనంపై సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో పనిచేసే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. దీని తర్వాత జన్‌ధన్ యోజన పథకం తెచ్చారు. ప్రస్తుతం 500, వెయ్యి నోట్లను రద్దు చేశారు. మూలధనం లాభాలపై అటువంటి మూల ధన ఆస్తి భారతదేశంలో ఉండి ఉంటే, పన్నును విధించడానికి మారిషస్‌తో డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్‌ను ప్రభుత్వం కుదుర్చుకుంది. అలాగే స్విట్జర్లాండ్‌తో ఆటోమెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ఛేంజ్ అగ్రిమెంట్‌పై నరేంద్ర మోదీ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఇతర టాక్స్ హేవెన్స్‌తోనూ ఇటువంటి ఒప్పందాలకోసం చర్చలు జరుగుతున్నాయి. 2017 నుండి ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ దేశాలు విదేశీ ఖాతాదారుల సమచారాన్ని పరస్పరం పంచుకోవడానికి అంగీకారం తెలిపాయి. రానున్న రోజుల్లో నల్లధనం పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది

- బండారు దత్తాత్రేయ, కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి