ఫోకస్

ఇదేం గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లధనం బయటపెడతానంటే అందరూ స్వాగతించాం. కాని నల్లకుబేరుల జాబితా బహిర్గతం చేయలేదు. అంతకంటే మించి నల్లమార్కెట్ పుంజుకుంది. మార్కెట్లో గందరగోళం, అయోమయం. ఏ క్షణాన ఏ రూల్స్ ప్రకటిస్తారో తెలియదు. మన ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8న ఆకస్మాత్తుగా పెద్దనోట్లను రద్దుచేయడంవల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోంది. బడుగు బలహీనవర్గాలతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఎక్కువ రేట్లు పెట్టి నిత్యావసర వస్తువులు కొనుక్కోలేకపోతున్నారు. వారివద్ద డబ్బు లేదు. బ్యాంకుల్లో నగదు లేదు. ఎటిఎంలు మూతపడ్డాయి. 120 కోట్ల జనాభాలో 80 శాతం ప్రాంతాల్లో బ్యాంకులు లేవు. 90 శాతం ప్రాంతంలో ఎటిఎంలు లేవు. 6 లక్షలకు పైగా ఉన్న గ్రామాలకు ఎన్ని బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి? మనది నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఎన్నికలకు ముందు స్విస్‌బ్యాంకుల్లో మూలుగుతున్న 75 లక్షల కోట్ల నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని చెప్పి ఇచ్చిన హామీ అటకెక్కింది. బ్యాంకులకు 8లక్షల కోట్ల రూపాయల మేర పారిశ్రామికవేత్తలు, నల్లకుబేరులు బకాయిపడ్డారు. వారిని బోను ఎక్కించలేకపోయారు. వారి పేర్లు బహిర్గతం చేయలేదు. స్విస్ ఖాతాలు ఉన్నవారి పేర్లు బయటకు రాలేదు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ఆడుతున్న రాజకీయ ఎన్నికల జూదమా అనిపిస్తుంది. రాత్రికి రాత్రి పెద్ద నోట్ల రద్దువల్ల సామాన్యుల సంగతి ఏమిటి? క్యూలలో కోటీశ్వరులు నిలబడడం లేదు. కిలోమీటర్లకొద్దీ నడిచి క్యూలలో గ్రామీణులు నిలబడుతున్నా, వారి వంతు వచ్చే సరికి నగదు లేదని బ్యాంకర్లు అంటున్నారు. ఇదేమి ఖర్మ. మన నగదును మనం తీసుకోలేని దుస్థితి. దేశంలో 86 శాతం కరెన్సీ పెద్దనోట్లలో ఉంటే వాటిని రద్దు చేస్తే 14 శాతంతో 120 కోట్ల మంది బతకాలంటే ఎలా? ముందుగా సరిపడా కొత్త నోట్లను ముద్రించలేదు. ఆర్థికవేత్తలతో సమావేశం లేదు. రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోలేదు. ప్రతిరోజూ కొత్త కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. దీనిని సాకుగా చేసుకుని నల్లమార్కెట్ విస్తరిస్తోంది. నల్లధనం వెలికి తీయాలన్న సంకల్పం మంచిదే అయినా ఆచరించిన విధానంలో లోపాలు ఉన్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే నల్లమార్కెట్ మరింత విస్తరించి నల్లధనం కొత్త రూపం దాలుస్తుంది. డిజిటల్, స్వైప్, ఎటిఎం, యాప్, ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్ గురించి నిరక్షరాస్యులకు ఏమి తెలుస్తుంది? మోదీ ఇప్పటికైనా పంతాన్ని వదిలి జనబాహుళ్యం పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు నగదును అందుబాటులోకి తేవాలి.

- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే