ఫోకస్

కోర్టులపై నమ్మకం పోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నతస్థాయి న్యాయస్థానాల్లో విచారణకు వస్తున్న కేసుల్లో

తీర్పు ఇవ్వడంలో తీవ్రమైన జాప్యం జరుగుతుండటం వల్ల

కోర్టులపై ప్రజలకు నమ్మకం పోతోంది. ఈ నేపథ్యంలో

‘కన్సాలిడేటెడ్ హోలిస్టిక్ అప్రోచ్’ ఉండాలి. క్రిమినల్

కేసులతోపాటు సివిల్ కేసులు కూడా దశాబ్దాల తరబడి

పెండింగ్‌లో ఉంటున్నాయి. యావజ్జీవ కారాగారశిక్ష 14

సంవత్సరాలపాటు ఉండగా, కేసుల విచారణలో

అంతకుమించి జాప్యం జరుగుతోంది. దాంతో కోర్టులపై

ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. అందువల్ల ఉన్నత

న్యాయస్థానంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై

దృష్టి సారించి సరైన పరిష్కార మార్గాలను కనుగొనాలి.

మొట్టమొదట ఉన్నత న్యాయస్థానాలపై భారం తగ్గించాలి.

న్యాయస్థానాల్లో దాఖలవుతున్న పిటిషన్లను మొట్టమొదట

వడపోసే విధానం ఉండాలి. పిటిషన్ దాఖలు కాగానే అవి

విచారణ యోగ్యంగా ఉన్నాయా లేదా పరిశీలించి నిర్ణయం

తీసుకోవాలి. కొన్ని దేశాల్లో కేసులను మొట్టమొదట

వడపోస్తారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాటిని

పరిష్కరించేందుకు వీలుంటే అవే మార్గాల్లో పరిష్కరిస్తారు.

తప్పనిసరిగా కోర్టులోనే వాదనలు జరిగి తీర్పు రావాల్సి

ఉందని భావిస్తే అలాంటి కేసులను విచారణకు స్వీకరిస్తారు.

కోర్టులకు ఇచ్చే సెలవులను కూడా బాగా తగ్గించాల్సి ఉంది.

కోర్టు కేసుల విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాల్సి

ఉంది. జడ్జీల ప్రమేయం లేకుండా పరిష్కరించుకునే

అవకాశం ఉంటే అదే విధానంలో సమస్యలను

పరిష్కరించుకుంటే బాగుంటుంది. మనవద్ద లోక్

అదాలత్‌లు ఉన్నప్పటికీ, ఇవి పూర్తిస్థాయిలో కోర్టులపై

భారాన్ని తగ్గించలేకపోతున్నాయి. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్

రిసొల్యూషన్ (ఎడిఆర్) విధానాన్ని చేపడితే బాగుంటుంది.

ఎడిఆర్‌లో కన్సిలియేషన్/మీడియేషన్, అడ్జుడికేషన్,

ఆర్భిట్రేషన్ విధానాలు ఉన్నాయి. ఈ విధానాలవల్ల కోర్టుల

చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. న్యాయవాదులకు,

కోర్టులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అనేక

దేశాల్లో ఈ విధానాలను అమలు చేస్తున్నందు వల్ల కోర్టుల్లో

నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గుతుంది.
ప్రస్తుతం కోర్టుల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య బాగా

పెరిగిపోతోంది. న్యాయవాదులు తరచూ వాయిదా

కోరుతుంటారు. దాంతో విచారణ వేగంగా చేసేందుకు,

తీర్పులు ఇచ్చేందుకు జాప్యం జరుగుతోంది. ఈ

కారణంగానే ‘డిస్పోజల్ రేట్’ బాగా తగ్గింది. మారుతున్న

కాలానికి అనుగుణంగా ప్రొసీజరల్ లాలో మార్పులు,

చేర్పులు చేయాల్సి ఉంటుంది. కోర్టుల్లో జడ్జీల ఖాళీలను

ఎప్పటికప్పుడు భరీచేయాలి. ఇందుకోసం ఎగ్జిక్యూటివ్,

న్యాయ విభాగాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. జడ్జీల

నియామకానికి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న

విధానంలో అవసరమైతే అందరికీ ఆమోదయోగ్యమైన

పద్ధతులను అమలు చేయాలి.

- జస్టిస్ ఎ. లక్ష్మణ్‌రావు ప్రధాన న్యాయమూర్తి (రిటైర్డ్), అలహాబాద్ హైకోర్టు