ఫోకస్

రాద్ధాంతం అనవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసం కాదు. తలాఖ్ ఒక మతానికి సంబంధించిన అంశం. రాజ్యాంగంలో అన్ని మతాలకు, అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగానూ, ప్రతికూలంగానూ హక్కులుండవు. అవి మనం రూపొందించుకున్నవే. అనాదిగా వస్తున్న మత ఆచారాలు, సంప్రదాయాలను ఆయా వర్గాల ప్రజలు ఎవరూ వదులుకోరు. సివిల్ కామన్ కోడ్ పేరుతో ట్రిపుల్ తలాఖ్‌ను అప్రతిష్టపాలు చేస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్లాంపై కుట్ర పన్నుతోంది. హిందూత్వ ముసుగులో ఒక వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దు. తలాఖ్ అనేది ఇస్లాం మతంలోని ఒక ఫత్వా లాంటిది. అయితే మూడుసార్లు తలాఖ్ అనగానే ఒక సంసారం వీగిపోతుందనో.. మరో కుటుంబం నిలబడుతుందనో భావనను మనస్సునుంచి తొలగించుకోవాలి. ప్రస్తుత సమాజంలో తలాఖ్ పొందిన కుటుంబాలు బాగానే ఉన్నాయి. తలాఖ్ తీసుకునే వారు కూడా బాగుపడతారని అనుకోవాలి. ఎందుకంటే వారి వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. అయితే తలాఖ్.. తలాఖ్.. తలాఖ్.. అని మూడుసార్లు అంటే తలాఖ్ పొందినట్టే అని భావింపరాదు. దీనికి కొన్ని షరతులు ఉంటాయి. నియమ నిబంధనలతో ఇరువర్గాల సమక్షంలో జరుగుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తలాఖ్‌పై పూర్తి అవగాహన లేకుండా ఒకే డైలాగ్‌తో తలాఖ్ అనే పదాన్ని భ్రష్టుపరుస్తోంది. ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు.. రాజ్యాంగంలో పొందుపరచిన అంశం కాదు. ఇది మతానికి, మత స్వేచ్ఛతో ముడిపడిన అంశం. దీనిపై ఏ వర్గానికి చెందిన వారు గానీ, ఏ ప్రభుత్వమైనా గానీ రాద్దాంతం సృష్టించొద్దు.

- పీర్ మునీర్ అహ్మద్ జావెద్ ఉలేమా రాష్ట్ర కమిటీ సభ్యుడు