ఫోకస్

మోదీది తొందరపాటు చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్లు రద్దు చేయడంలో ప్రధాని మోదీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రధాని ఆశించిన రెండు అంశాలు అరికట్టలేకపోయారు. ధనవంతులు సంతోషంగానే ఉన్నారు. సామాన్య ప్రజలే ఇక్కట్లకు గురవుతున్నారు. పెద్ద నోట్లను రద్దు చేసే సమయంలో నల్లధనం వెలికితీస్తానని, ఉగ్రవాదాన్ని అరికడతానని ప్రధాని భరోసా ఇచ్చారు. దీనికి ప్రజాస్వామ్యంలో ‘నో’ అనే వారు ఎవరూ ఉండరు. ఆ రెండు అంశాలను మేమూ సమర్థిస్తున్నాం. అయితే నోట్ల రద్దు వెనుక రాబోయే పరిణామాలు ఊహించి అందుకు తగిన ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మోదీ తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు నష్టపోయారు. పేదవానికి కూలీ లేక అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. మోదీ కోరిన 50 రోజులు గడువు అయిపోతోంది. పెద్దనోట్లను రద్దు చేసినపుడు అందుకు సరిపడా నగదును పెంచకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం వల్ల సామాన్య ప్రజానీకమంతా నానాఇబ్బందులు పడ్డారు. ప్రజలను కార్డుమీద సరకులు తెచ్చుకోమంటున్నారు. ప్రజల్లో అవగాహన కలగకుండా కార్డుతో సరుకులు కొనండి అంటే ఎలా? ఏదేని మార్పు తీసుకురాదలిస్తే దానిపై ముందు ప్రజల్లో అవగాహన కల్పించాలి. అందుకు కొంత సమయం వెచ్చించాలి. ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఎటిఎం కౌంటర్లను మూసివేసి, బ్యాంకులో అరకొర సిబ్బందితో పనిచేసి ప్రజలకు సేవలు అందుతున్నాయంటే ఎలా? తీరా బ్యాంకుల్లో రూ.2వేల నోటు ఇచ్చి ‘తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్న సామెతలా ఉంది. నోటు దొరికినా చిల్లర దొరక్క ప్రజలు నానాఅవస్థలు పడ్డారు. ఇప్పటికైనా కేంద్రం యుద్ధప్రాతిపదికన రూ.వంద, రూ.500 నోట్లు అందుబాటులోకి తీసుకురావాలి. బ్యాంకులో ఎంత మొత్తం డిపాజిట్ అవుతుందో, దానికి సమానంగా కొత్తనోట్లు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవు. కాగా, డిపాజిట్లకు, విత్‌డ్రాలకు మధ్య సమతౌల్యం లేకుండా ఉంది. అందువల్లనే ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లుతెరచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- బొత్స సత్యనారాయణ ఏపి వైకాపా నాయకుడు