ఫోకస్

జోనల్ వ్యవస్థ ఉండటం శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ కొనసాగించడం శ్రేయస్కరం. దీనివల్ల వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో మేలు కలుగుతుంది. జోనల్ వ్యవస్థ వల్ల వెనుకబాటుతనం తగ్గుతుంది. ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయి. జోనల్ వ్యవస్థలో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్, ఇతర ప్రాంతాల వారికి 20 శాతం కోటా లభిస్తుంది. దీనివల్ల ఉద్యోగాల ఎంపికలో ఆ ప్రాంతంలో నివసించే అభ్యర్థులకు మధ్య పోటీ ఉంటుంది. సీనియారిటీ కూడా అదే పద్ధతిలో నిర్ణయిస్తారు. ఉద్యోగాల ఎంపికలో ఒకే ప్రాంతంలో నివసించే వారి మధ్య పోటీ ఉండటం వల్ల సమాన ఐక్యూ ఉండే అభ్యర్థుల మధ్య ఒకే రకమైన పోటీ ఏర్పడుతుంది. దీనివల్ల ఒక ప్రాంతంలో నివసించే అభ్యర్థులు ఒకే రకమైన పోటీని ఎదుర్కొంటారు. ఈ విధానం వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేటపుడు కూడా స్థానికుల మధ్య సీనియారిటీ కల్పించడం వల్ల ఎక్కువ మందికి న్యాయం జరుగుతుంది. ఇక బదిలీల విషయానికి వస్తే ఏ జోన్‌కు అదే జోన్ పరిధిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల క్లాస్-4, ఇతర ప్రాంత ఉద్యోగులు తమ సమీప ప్రాంతంలోనే బదిలీలు నిర్వహించడం వల్ల వారికి నిర్వహణ వ్యయం తగ్గుతుంది. మరోపక్క ఏదేని జోన్ వెనుకబడి ఉంటే దానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఆ ప్రాంతం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అదే జోనల్ వ్యవస్థ రద్దు చేసినట్లయితే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో రాష్టమ్రంతటికీ ఒకే సీనియారిటీ కిందకు తెస్తారు. దీనివల్ల స్తబ్దత ఏర్పడే ప్రమాదం ఉంది. జోనల్ వ్యవస్థ లేకపోతే కేవలం బాగా అభివృద్ధి చెందిన పట్టణాలైన గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని అభ్యర్థులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిగిలిన ప్రాంతాలు ఎక్కువగా నష్టపోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రాంతీయ విభేదాలు మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణాలో జోనల్ వ్యవస్థ రద్దు చేయాలని ప్రతిపాదించినప్పటికీ దానికి రాష్టప్రతి ఆమోదం కావాలి. జోనల్ వ్యవస్థ రద్దు చేయడం సమంజసం కాదు. మన రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలు. జోనల్ వ్యవస్థను కొనసాగించడం వల్ల ఈ ప్రాంత అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా కలుగుతున్నాయి.

- గాదె శ్రీనివాసులనాయుడు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ