ఫోకస్

అసమానతలు తొలగేవరకూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాంతీయ అసమానతలు పూర్తిగా తొలగేవరకు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జోన్ల వ్యవస్థ కొనసాగి తీరాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థకు చరమగీతం పాడారంటూ ఇక్కడ కూడా అదే విధానం కొనసాగించే ప్రయత్నం ఎంతమాత్రం సహేతుకం కాదు. నదీతీర ప్రాంతాల్లో పుష్కలంగా ఆర్థిక వెసులుబాటు ఉండటంతో ఆ ప్రాంతంలో విద్య, సాంస్కృతిక, కళారంగాలతోపాటు నాగరికత పరిఢవిల్లుతూ వచ్చింది. దీంతో సాధారణంగానే క్రమేణా ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రాయలసీమతోపాటు తెలంగాణ జిల్లాలు ఈ ప్రాంతాలతో పోటీ పడలేకపోయాయి. ప్రతిభ, అర్హతలు నదీతీర ప్రాంతాల్లో అధికంగా ఉండటంతో ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడే మెండుగా ఉంటూ వచ్చాయి. దీనివల్లే ప్రాంతీయ అసమానతలు ప్రజ్వరిల్లి, విభజనవాదానికి దారితీశాయి. ఆ సమయంలో రాష్టప్రతి ఉత్తర్వుల ద్వారా ఆంధ్రలో నాలుగు, తెలంగాణలో రెండు జోన్లు ఏర్పాటు చేయటం జరిగింది. జూనియర్ అసిస్టెంట్లు, గుమాస్తాలు, అటెండర్లు, డ్రైవర్లు, పోలీసు కానిస్టేబుళ్లతోపాటు ఆ క్యాడర్‌కు సమానమైన టెక్నికల్ సిబ్బంది జిల్లా స్థాయిలోనే నియామకాలు, బదలీలకు, సీనియర్ అసిస్టెంట్ నుండి గెజిటెడ్ హోదా కలిగిన సూపరింటెండెంట్ క్యాడర్ వరకు ఆయా జోన్‌లోనే నియామకాలు, బదలీలకు రాష్టప్రతి ఉత్తర్వులతో జరుగుతూ వచ్చాయి. దీనివల్ల ఒక ప్రాంతంవారు వచ్చి మా ప్రాంతాల్లో తిష్టవేస్తున్నారనే అపోహలకు ఆస్కారం లేకుండా పోయింది. అయితే తెలంగాణలో రెండు జోన్లలోను నేటికి ఒకే పరిస్థితి ఉండటం వల్లే జోన్ల రద్దువల్ల ఎలాంటి వ్యతిరేకత రాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలు నేటికి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నందున ఇప్పట్లో జోనల్ వ్యవస్థ రద్దు ఏమాత్రం సమంజసం కాదు. అయితే 55 వేల ఎకరాల్లో నిర్మాణం అవుతున్న రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించటంవల్ల అన్ని ప్రాంతాల వారు ఆ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.

-ఎ.విద్యాసాగర్, ఎన్‌జివో సంఘం పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు, విజయవాడ