ఫోకస్

జిల్లా, రాష్ట్ర వ్యవస్థ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజనతోనే అనధికారికంగా జోనల్ విధానం రద్దయినట్టు. మల్టీ జోనల్ పోస్టులు, జోనల్ పోస్టులు, జిల్లా పోస్టులు, రాష్ట్ర పోస్టులు అంటూ నాలుగు వ్యవస్థలు ఉండేవి. రాయలసీమతో కలిపి ఇంటర్ జోనల్ పోస్టులు ఉండేవి. రాష్ట్ర విభజనతో ఇంటర్ జోనల్ పోస్టులు వ్యవస్థ రద్దయింది. మల్టీ జోనల్, జోనల్ వ్యవస్థలో ఒకటి రద్దయింది. ఇంకొటి ఉంది. నాలుగు అంచెల వ్యవస్థ స్థానంలో రెండు అంచెల వ్యవస్థ ఉండాలి. జిల్లా పోస్టులు, రాష్ట్ర పోస్టులు ఈ రెండు వ్యవస్థలు మాత్రమే ఉండాలి. జిల్లా క్యాడర్ సంఖ్య ఎక్కువగా ఉండాలి. రాష్ట్ర క్యాడర్ తక్కువగా ఉండాలి. జోనల్ పోస్టులను జిల్లా క్యాడర్‌లో చేర్చాలి. జోనల్ వ్యవస్థలో సైతం తెలంగాణకు న్యాయం జరగలేదు. ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు జోనల్ వ్యవస్థలో న్యాయం జరగలేదు. తెలంగాణలో అన్ని జిల్లాలకు సమ న్యాయం జరిగే విధంగా జిల్లా క్యాడర్, రాష్ట్ర క్యాడర్ విధానం ఉండాలి. రెండంచెల వ్యవస్థ ఏర్పాటుతో పని చేసే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి ఆఫ్షన్ ఇవ్వాలి. ఇక ప్రస్తుతం ఉన్న స్థానికత నిర్థారణ విధానంలో మార్పు తీసుకు రావాలి. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం నాలుగువ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని బట్టి స్థానికతను నిర్థారిస్తున్నారు. గతంలో ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో చదువుకోవడానికి అవకాశాలు లేక దూరప్రాంతాలకు వెళ్లి చదువుకునే వారు. ఇప్పుడు జిల్లాల సంఖ్య తక్కువ కావడం, ఆ ప్రాంతాలు జిల్లాలు కావడం వల్ల స్థానికత విధానంలో మార్పు అవసరం. తల్లిదండ్రులు ఏ ప్రాంతానికి చెందితే దాన్ని స్థానికతగా గుర్తించాలి. రెండంచేల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే వినతిపత్రం ఇచ్చాం. ప్రభుత్వం అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని జిల్లాలకు న్యాయం కలిగే విధంగా రెండంచెల విధానాన్ని అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ స్థానంలో నూతన విధానంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. అందరితో చర్చించి, అన్ని జిల్లాలకు న్యాయం కలిగే విధంగా నూతన విధానం అమలు చేయాలి

- దేవీప్రసాద్ టిఎన్‌జివో సంఘం గౌరవాధ్యక్షుడు