ఫోకస్

రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోనల్ విధానాన్ని రద్దు చేయాలనుకోవడం అనాలోచిత చర్య. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ జిల్లాల్లో సామాజికంగా, ఆర్థికంగా అంతరాలు ఉన్నాయి. జోనల్ విధానాన్ని తీసి వేయడంతో అనారోగ్యకరమైన పోటీ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పూర్తిస్థాయి న్యాయం జరగదు. తర్వాత జోనల్ విధానాన్ని ఎత్తి వేయడం రాజ్యాంగంలోని 371-డి ఆర్టికల్‌ను, రాష్టప్రతి ఉత్తర్వులను ఉల్లంఘించినట్లే అవుతుంది.
రాజ్యాంగ సవరణ లేకుండా జోనల్ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. పార్లమెంటు ఆమోదం, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా జోనల్ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ విధానం ఉండడం వల్ల, ఆంధ్ర ఉద్యోగులతో తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నదని ఆందోళన చెందారు. ఇప్పుడు తెలంగాణలోని వివిధ జిల్లాల్లోనూ అంతరాలు ఉన్నాయి. ఒక్కో జిల్లా ఒక సామాజిక పరిస్థితుల వల్ల ఏర్పడింది. ఆయా జిల్లాల్లో, జోన్‌లో వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయం చేసేందుకు ఉపయోగపడుతుంది. జోనల్ విధానాన్ని రద్దు చేసినట్లయితే ఉదాహరణకు- ఆదిలాబాద్‌లో ఉండే నిరుద్యోగి హైదరాబాద్‌లో ఉండే అభ్యర్థితో పోటీ పడాల్సి వస్తుంది. మారుమూలలో ఉండే అభ్యర్థి, అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న అభ్యర్థితో పోటీ పడడం సాధ్యం కాదు. విద్య, ఉపాధి అవకాశాలలో అన్యాయం చేసినట్లు అవుతుంది. హక్కులను కాలరాసినట్లు అవుతుంది. జోనల్ రద్దు అనేది సహేతుకం కాదు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు వెళ్ళడం సరైంది కాదు. జిల్లాల మధ్య అంతర్యం, వైరుధ్య భావాలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తొందరపడకుండా, అఖిలపక్ష సమావేశంలో చర్చించి వారి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ఏర్పాటు వల్ల జోనల్ విధానాన్ని ఎత్తి వేయవచ్చని ప్రభుత్వం చేస్తున్న వాదన సరైంది కాదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ఒకే విధంగా చూడరాదు. ఆర్థిక అసమానతలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా వాటికి పరిష్కార మార్గాలు అనే్వషించకుండా జోనల్ విధానాన్ని ఎత్తి వేయడం వల్ల, ఏదో చేశామని చెప్పుకోవడమే అవుతుంది తప్ప నిరుద్యోగులకు, ఎవరికీ ఉపయోగపడదు.
రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన వివిధ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి అసమానతలు అంతరించిపోలేదు. వీటికి కూలంకషంగా, శాస్ర్తియబద్ధంగా చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం మూర్ఖత్వపు చర్య అవుతుంది. కాబట్టి ప్రభుత్వం జోనల్ రద్దుపై పునరాలోచన చేయాలి.

- డాక్టర్ శ్రవణ్ దాసోజు ముఖ్య అధికార ప్రతినిధి, టి.పిసిసి