ఫోకస్

వ్యవస్థలో లోపంవల్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మతోన్మాదం పెచ్చరిల్లటం, పార్లమెంటరీ వ్యవస్థ సవ్యంగా పనిచేయక పోవటం వల్ల పాకిస్తాన్‌లో తీవ్రవాదం అధికమైంది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ వైపు ఎక్కువ మంది సైనికులు వెళ్లారు. భారతదేశంలో మాత్రం పార్లమెంటరీ వ్యవస్థ బలంగా ఉన్న కారణంగా నష్టం తక్కువ స్థాయిలో ఉంది. పాకిస్తాన్‌లో పార్లమెంటరీ వ్యవస్థ దెబ్బతినటంతో పలుమార్లు సైనికుల వశమై పాలన వారి చేతుల్లో కొనసాగింది. సైనిక పాలన కారణంగా పార్లమెంటరీ వ్యవస్థ ఛిన్నాభిన్నమై మతోన్మాదం పెచ్చరిల్లి తీవ్రవాదం వెళ్లూనుకుంది. తీవ్రవాదం శృతిమించటంతో పాకిస్తాన్ దేశం చాలా నష్టాన్ని చవిచూసింది. భారతదేశంలో కూడా హిందూ మతోన్మాదం పెరగటం వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయ. పాకిస్తాన్‌లో తీవ్రవాదం ప్రమాదకర స్థాయిలో ఉన్న కారణంగా భారతదేశం భారీ మూల్యం చెల్లించుకుంటోంది. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఉగ్రవాదం నానాటికి పెరగటం పొరుగు దేశమైన భారతదేశానికి అందోళన కలిగించే అంశం. తీవ్రవాదం వలన ఆనర్ధం జరుగుతోని, వాటి ప్రభావం భారత్‌పై పడి ఇబ్బందులకు గురవుతున్నాం. అజ్ఞాతంగా ఉంటూ శత్రువు దాడి చేయటం వలన ఎవరితో పొరాడాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నాం. దీని కారణంగానే ఉగ్రవాదంపై పొరాడటం ప్రతి దేశానికి కష్టతరంగా మారుతోంది. తీవ్రవాదాన్ని అణచి వేయటంలో అనేక దేశాలకు చెందిన ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ ఫలితాలు నామమాత్రంగా ఉన్నాయి. అన్ని దేశాలూ కలిసి తీవ్రవాదానికి వ్యతిరేకంగా పని చేయాలి.

- యలమంచిలి శివాజీ రాజ్యసభ మాజీ సభ్యుడు