ఫోకస్

సమీకృత పరీక్ష అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ స్థాయిలో నీట్, ఐఐటి జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలు నిర్వహించడం వెనుక కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని, ఆర్థిక భారం లేకుండా చూడాలన్నది నిర్దిష్టమైన లక్ష్యం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్రాల విద్యాసంస్థలు, డీమ్డ్ వర్శిటీలు, ఇతర జాతీయ ప్రాధాన్యత సంస్థల్లో అడ్మిషన్లకు ఒకే పరీక్ష జరగడం వల్ల అందరికీ ప్రయోజనం ఉంటుంది, కాని ఆచరణలో ఆ ఆశయం నెరవేరడం లేదు. పాత పద్ధతి కొనసాగుతున్నదే కనిపిస్తోంది. నీట్ అమలు చేయడం బాగానే ఉంది, కాని అది కేవలం మెడికల్, డెంటల్ కోర్సులకే పరిమితం చేశారు. ఎయిమ్స్, ఎఎంసి, జిప్‌మర్, తదితర ప్రవేశ పరీక్షల నిర్వహణకు అనుమతించడంవల్ల ఆ పరీక్షలూ రాయాల్సి వస్తోంది. డెంటల్ గాని, మెడికల్ గానీ కాకుండా మిగిలిన కోర్సులు అంటే యునాని, హోమియో, ఆయుర్వేదం కోర్సులతోపాటు వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సులకు వేరే పరీక్ష రాయాల్సి వస్తోంది. ఎమ్సెట్‌కు సంబంధించి కూడా ఉండాలా వద్దా అనే మీమాంస కొనసాగుతోంది. దేశంలో గాని, రాష్ట్రంలో గాని విద్యార్థులపై వత్తిడి తగ్గించాలనే ఆశయం ఎక్కడ నెరవేరుతోంది? ఆచార్య కమిటీ, రామమూర్తి కమిటీలు చేసిన సిఫార్సులు అమలు జరుగుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు, పిల్లలకు ఆర్థిక భారం ఎక్కడ తగ్గింది? తెలుగు రాష్ట్రాల్లో బైపిసి విద్యార్థులు నీట్, ఇతర జాతీయ ప్రవేశపరీక్షలతో పాటు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా నిర్వహించే ఎమ్సెట్ అగ్రికల్చర్ స్ట్రీం పరీక్షలు రాసుకోవాల్సి ఉంటుంది. అంటే అటు తిరిగి ఇటు తిరిగి దాదాపు అరడజనుకుపైగానే పరీక్షలు రాసిన తర్వాత అడ్మిషన్ల సమయంలో లెక్కలేనన్ని కాలేజీల్లో దరఖాస్తు చేసుకోవలసిన బాధ్యత కూడా ఉంటుంది. మొత్తం మీద చూస్తే తడిసి మోపెడు ఆర్ధిక భారం పడటం ఖాయం. అన్ని రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరపడం ద్వారా ఒక సమీకృత పరీక్షల విధానం తీసుకురావాలి. ఆచరణలో సంస్కరణలు ఫలితాలు సానుకూలంగా దక్కడం లేదన్నది నిర్వివాదాంశం. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక శాస్ర్తియమైన విధానం రూపొందించాల్సిన అవసరం ఉంది

- డాక్టర్ బి మధుసూధనరెడ్డి అధ్యక్షుడు, ప్రభుత్వ జూ.లెక్చరర్ల సంఘం తెలంగాణ