ఫోకస్

ఇంటర్ విద్య మారదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీట్ తరహాలో ఇంజనీరింగ్ ప్రవేశానికి కూడా కామన్ పరీక్ష అవసరం. నేడు విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటిఎస్‌లో చేరేందుకు జెఇఇ పరీక్ష రాయాల్సి వస్తుంది. ట్రిపుల్‌ఇ, జెఇఇ ఇతర రాష్ట్రాల్లో చేరడానికి ప్రిలిమినరీ పరీక్ష రాయాలి. ఇవి గాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఆయా రాష్ట్రాల్లోని పలు విద్యా సంస్థలు రకరకాల పరీక్షలు నిర్వహిస్తున్నాయ. ఇందుకోసం విద్యార్థులు అనేక రకాలుగా ప్రిపేర్ కావాల్సి వస్తుంది. ఒక్కో పరీక్ష ఒక్కో విధానంలో నిర్వహించడం వల్ల విద్యార్థులు అనేక గందరగోళాలకు గురవుతున్నారు. ప్రతి పరీక్షకు సిలబస్‌లో ఎంతోకొంత మార్పుతో కూడి ఉంటుంది. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి తరహాలో నిర్వహించే పరీక్షలు ఒక్కో రకంగా ఉంటున్నాయి. ఇందుకోసం విద్యార్థులు కోచింగ్‌లు లేదా శిక్షణలు తీసుకోవడం తప్పనిసరి అవుతోంది. ఇవి రకరకాల షెడ్యూల్స్‌లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఏ కళాశాలలో సీటు వస్తుందో తెలియక అన్ని రకాల పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఆ విధంగా వాళ్లమీద వత్తిడి ఎక్కువగా పడుతోంది. ఇందుకు విద్యార్థులు బట్టీపట్టే విధానంగాకుండా అవగాహనతో సిలబస్ చదవాలి.
విద్యార్థులపై వత్తిడి తగ్గించేందుకు, గందరగోళాన్ని తొలగించేందుకు దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యను కామన్ సిలబస్ కిందకు తీసుకురావాలన్న అభిప్రాయంతో కేంద్రం ఉంది. దీనివల్ల విద్యార్థులకు మేలు కలగనుంది. దీనివల్ల విద్యార్థులకు సమానమైన అవకాశాలు కలుగుతాయి. విద్యార్థులు వాళ్లస్థాయిని పెంచుకోడానికి అవకాశం కలుగుతుంది. అనేక విద్యా సంస్థలు ఈ టెస్ట్ బేస్‌గా పరీక్షలు నిర్వహిస్తాయి. కాబట్టి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇపుడు అనేక మంది విద్యార్థులు ఆ రాష్ట్రంలో నిర్వహించే పరీక్షలు తప్ప ఇతర రాష్ట్రాల్లో నిర్వహించే పరీక్షలు రాయడం లేదు. దీనివల్ల వారికి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా బయట కళాశాలలో చేరే అవకాశాలు కోల్పోతున్నారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడితే నష్టపోతామనే అపోహ విద్యార్థుల్లో ఉంది. అది నిజం కాదు.
ఇక విద్యార్థులు వత్తిడికి గురికాకుండా ఉండాలంటే కళాశాలల్లో ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ అవసరం. కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి. విద్యార్థులు శారీరకంగా ధృఢంగా ఉన్నప్పుడే వారి మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. శారీరకంగా ఎదగాల్సిన ఈ సమయంలో కేవలం విద్యపై పూర్తిగా కేంద్రీకృతం చేయడం వల్ల విద్యార్థులు ఎమోషనల్‌గా బలంగా ఉండలేకపోతున్నారు. నిరాశకు గురై మానసిక వేదనకు గురవుతున్నారు. అందువల్ల పాత విద్యా విధానం తరహాలో పోటీతత్వం నుంచి బయటపడి క్రీడలు, సాంస్కృతిక సేవలు, సామాజిక సేవలు వాటితో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలి. అలాంటపుడే విద్యమీద కూడా సరైన పట్టు వస్తుంది.

- డాక్టర్ కెవిఎల్ రాజు ప్రిన్సిపాల్, ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాల