ఫోకస్

ఐకమత్యంతో సాధిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని రంగాల్లో ముస్లింలు వెనుకబడివున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యతే వెనుకబడటానికి ప్రధాన కారణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింలకు రిజర్వేషన్లు కలిస్తే అక్షరాస్యతశాతం పెంపొందడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. కేవలం మత కలహాలు, ఇతరత్రా దేశాలపై ఉన్న అసాంఘిక కార్యకలాపాలు, స్థానిక ముస్లిం సోదరులపై దిద్దడంతో ముస్లింలపై ప్రజల్లో అపోహలున్నాయి. ముస్లింలలో కూడా మేధావులు అన్ని రంగాల్లో ఉన్నారు. అన్ని కులాలు, మతాలతోపాటు ముస్లింలకు రాజకీయంగా విద్య, వైద్య పరంగా రిజర్వేషన్ కల్పించాలి. ముస్లింలలో కూడా అనేక తెగలు ఉన్నాయి. కొన్ని తెగలకే రాష్ట్ర ప్రభుత్వం బిసిలుగా ప్రకటించడం వల్ల మిగిలిన తెగలవారికి అన్యాయం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒకే నినాదంతో రిజర్వేషన్లు కల్పించి, విద్యాసంస్థలు ఏర్పాటుచేసి ఆర్థికంగా సహాయం చేయాలి. రిజర్వేషన్ సౌకర్యాలు కల్పిస్తే అందరికీ విద్య అనే నినాదంతో ముస్లింలు ఉన్నతస్థాయికి చేరుతారు. అన్ని మతస్థులు, అన్ని కులాల వారు ముస్లిం రిజర్వేషన్ చేపట్టేందుకు కృషి చేయాలి. ముస్లింలు కూడా ఐక్యమత్యంతో రిజర్వేషన్ సాధనకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతియుతంగా పోరాడి సాధించుకోవాలి. ప్రభుత్వాలు కూడా ముస్లింల నుంచి వ్యతిరేకత రాకముందే రిజర్వేషన్ల విషయంలో చట్ట్భద్రత కల్పించాలి.

- ఆరిఫుల్లా హుస్సేని చిష్ట్ఫిల్ ఖాద్రి పెద్దదర్గా పీఠాధిపతి, కడప