ఫోకస్

పేదలకే రిజర్వేషన్లు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో అణగారిన, వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలి. ప్రస్తుతం వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల సదుపాయం ఉంది. వారి కోటాకు ఇబ్బంది లేకుండా ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించాలి. మతపరమైన కోణంలో ఈ రిజర్వేషన్లను చూడరాదు. మతం అనేది కేవలం ఆధ్యాత్మికత, ఆచార వ్యవహారాలు, వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినది. అంతేకాని ముస్లింలు అయినంత మాత్రాన వారికి రిజర్వేషన్లు కల్పిస్తే ఏమో జరుగుతుందనే అర్థంపర్థం లేని ఆందోళనల్లో పసలేదు. ఈ ఆరోపణలకు ప్రాతిపదిక లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధితో పోరాడినందువల్ల ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎన్నో న్యాయపరమైన వివాదాలు తలెత్తినా, మొక్కవోని విశ్వాసం, పట్టుదలతో ముస్లింలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ రిజర్వేషనే్ల ప్రస్తుతం అమలవుతున్నాయి. వాటి ఫలాలను ముస్లిం వర్గాలు అనుభవిస్తున్నాయి. వందల సంవత్సరాల క్రితం అనేక చారిత్రక కారణాల వల్ల ముస్లిం వర్గంలోకి మతం మారినంత మాత్రాన వారు మన సమాజంలో భాగమే అనే విషయాన్ని మరువరాదు. చరిత్రను తవ్వుకుని నిందించుకోవడంవల్ల ఒరిగేదేమీ లేదు. ప్రస్తుతం ముస్లిం సమాజంలో పేదరికం దుర్భరంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక కమిటీలు వీరి స్థ్ధితిగతులను అధ్యయనం చేసేందుకు నియమించారు. కేంద్రం యుపిఏ హయాంలో సచార్ కమిటీని నియమించింది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే బిసి వర్గాలకు అన్యాయం జరుగుతుందనే అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే అగ్రకులాల్లో పేదలు ఉన్నారు. వీరిని గుర్తించి రిజర్వేషన్లను ఇబిసి కోటాలో కల్పించారు. ముందుగా బిసి వర్గాలకు కించిత్తు కూడా అన్యాయం జరగకుండా, ఆ తర్వాత ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టబద్ధమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. అంతేకాని ఇరు వర్గాల మధ్య ఆజ్యం పోసే విధంగా ప్రభుత్వం వ్యవహరించరాదు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడచినా ఇంకా సమాజంలో అసమానతలు పోలేదు. రిజర్వేషన్లను మతం ప్రాతిపదికన కల్పించడం అనే వాదన కంటే దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్న వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవుల్లో కూడా పేదలున్నారు. వీరికి కూడా ఇబిసి కోటాలో రిజర్వేషన్లు కల్పించడం సముచితం. ఏ వర్గాన్ని నొప్పించకుండా రిజర్వేషన్లు కల్పించాలి. లేనిపక్షంలో సమాజంలో అశాంతి నెలకొంటుంది.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభపక్ష ఉపనేత, ఆంధ్రప్రదేశ్