ఫోకస్

కొంత మోదం, కొంత ఖేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత గొప్పగా కానీ, అంత చెడ్డగానీ ఉందనలేం. పరిశ్రమలు స్థాపించేవారికి ప్రోత్సహంగా ఉంది. రైతాంగానికి అంత ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు. కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 30 శాతం నుంచి 25 శాతానికి పన్ను తగ్గింపు మంచి పరిణామం. రైతులకు బడ్జెట్‌లో ఇంకా ఎక్కువ కేటాయింపులు ఉంటాయని ఆశించినప్పటికీ ఇది నిరాశపర్చింది. వ్యక్తిగత ఆదాయ పన్నును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ఆహ్వానించదగిన పరిణామం. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు ఎక్కువ మందిపై తక్కువ భారం పడుతుంది. ప్రభుత్వం నుంచి సౌకర్యాలు పెరగడమే కాకుండా వ్యక్తిగత ఆదాయ పన్ను సగానికి తగ్గుతుండటంతో ఆదాయ పన్ను చెల్లించేందుకు కొత్తవారు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దేశంలోని 90 శాతం పరిశ్రమలకు ఈ బడ్జెట్ లబ్ధికలిగిస్తుంది. పరిశ్రమల వృద్ధికి, తద్వారా ప్రస్తుతం దేశానికి అవసరమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ఇది కచ్చితంగా దోహదపడుతుందని చెప్పవచ్చు. ఈ బడ్జెట్‌లో మూడు ముఖ్యమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఇదే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం. మునుపెన్నడూ ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రతిపాదించిన సందర్భాలు లేవు. అలాగే రైల్వే బడ్జెట్‌ను వేరుగా కాకుండా ప్రధాన బడ్జెట్‌లోనే విలీనం చేయడం రెండవది. ప్రణాళికా, ప్రణాళికేతర పద్దులకు స్వస్తిపలికి రెవిన్యూ, క్యాపిటల్ పద్దులుగా బడ్జెట్‌ను రూపొందించడం మూడవది. మూసా పద్ధతిలో కాకుండా బడ్జెట్ రూపకల్పనలోనూ కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు.

-కల్వకుంట కవిత పార్లమెంట్ సభ్యురాలు తెలంగాణ రాష్ట్ర సమితి