ఫోకస్

కార్పొరేట్‌లకే పెద్ద పీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రతిపాదించిన బడ్జెట్ కార్పోరేట్ సంస్ధలకే పెద్ద పీట వేశారు. బడగు, బలహీనవర్గాలపై మరింత భారం మోపారు. బడ్జెట్‌లో ఏదీ స్పష్టత లేదు. సంపన్నులకు రాయితీలను కొనసాగించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు సంవత్సరానికి 5 లక్షలకు మించి ఆదాయం ఉన్నట్లయితే 20 శాతం ఆదాయ పన్ను చెల్లించాలని, 2.5 నుంచి 5 లక్షల వరకు ఆదాయం ఉన్న 5 శాతం ఆదాయ పన్ను చెల్లించాల్సి వస్తుంది. రైతులకు రాయితీలు ప్రకటించడంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ విఫలమయ్యారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదనడానికి ఇది నిదర్శనం. విద్యారంగం, ఆరోగ్య రంగంతో ప్రభుత్వం తన ధోరణి ఏ మాత్రం మార్చు కోలేదు, ప్రైవేటీకరించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనివల్ల సామాన్యుడుకి వైద్యం అందని పరిస్థితి, విద్య అందని పరిస్థితి ఏర్పడింది. కార్మికుల హక్కులను సైతం కాలరాసే విధంగా అరుణ్ జైట్లి తన బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. వాస్తవానికి ఆ అంశాలు ఆయన పరిధిలోనివి కానే కావు, దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలు మరింత బలహీనపడే పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ చూస్తుంటే మరింత వేగంగా ప్రైవేటీకరణ చేసేలా కేంద్రం కనిపిస్తోంది. పిఎస్‌యులు దీంతో కృంగిపోవడం ఖాయం. విదేశీపెట్టుబడుదారులు అన్ని రంగాల్లో చొరబడేలా విదేశీ పెట్టుబడుల నిబంధనలను మరింత సరళీకృతం చేశారు. అధిక విలువ కలిగిన నోట్ల చెల్లుబాటును నియంత్రించిన అంశంపై ఆర్ధిక మంత్రి మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో సరిగా వివరించలేకపోయారు. వాస్తవికంగా దేశంలో ఉన్న నల్లధనం ఎంతో, ఎంత వెలికితీశారో, ఇంకా ఎంత వెలికి తీయాలో కూడా చెప్పలేకపోయారు. అలాగే నకిలీ కరెన్సీ ఎంత ఉందో కూడా ఆర్ధిక మంత్రి సరిగా చెప్పలేకపోయారు. ప్రమాదాలు లేని రీతిలో రైల్వే శాఖను రెండేళ్లలో తీర్చిదిద్దుతామని చెప్పడం ఆలోచించదగిన అంశమే. రాజకీయ పార్టీల పరంగా చూస్తే పార్టీ నిధులను కరెన్సీ రూపంలో ఇచ్చే వెసులుబాటును 20వేల నుండి 2వేలకు తగ్గించడం దారుణం.

-సురవరం సుధాకర్‌రెడ్డి జాతీయ ప్రధానకార్యదర్శి, సిపిఐ