ఫోకస్

మాటల ప్రభుత్వమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రయోజనాలు కల్పించిన దాఖలాలు లేవు. రాష్ట్రానికి రైల్వే జోన్ కేటాయింపు అంశంగానీ, ప్రత్యేక హోదా అంశం గురించి గానీ బడ్జెట్‌లో పేర్కొనకపోవడంతో నిరాశపరచింది. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలుగానీ, ప్రధాని మోదీ ఇచ్చిన హామీలుగాని బడ్జెట్‌లో పొందుపరచకపోవడం చూస్తుంటే బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఒనగూరినట్టు కన్పించడం లేదు. ఇదిలా ఉండగా ఇతర ఏ వర్గాలకు బడ్జెట్ సంతృప్తిని కలిగించలేదు. ఇక పెద్ద నోట్లు రద్దు వల్ల వివిధ రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. దీని ప్రభావం జాతీయోత్పత్తి (జిడిపి)పై పడింది. దీంతో కేంద్ర బడ్జెట్‌లో ఏదేని మేలు కలుగుతుందని భావించినప్పటికీ నిరాశ మిగిల్చింది. కుంటుపడుతున్న జిడిపిని ఏ రకంగా అభివృద్ధి చేయనున్నదీ స్పష్టం చేయలేదు. పారిశ్రామిక వర్గానికి, వ్యవసాయ రంగానికి వచ్చే ఏ విధంగా అభివృద్ధి చేస్తారన్నదీ బడ్జెట్‌లో పేర్కొనలేదు. సరైన కార్యాచరణ లేదు. మొత్తం మీద బడ్జెట్‌ను పరిశీలిస్తే.. అభివృద్ధి కుంటుపడే విధంగా కన్పిస్తొంది. ఈ చర్యల వల్ల అన్ని రంగాలు కుంటుపడనున్నాయి. రాష్ట్రంలో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన వారికి కేపిటల్ గైన్స్‌కి మినహాయింపు మినహా రాష్ట్రంలో మరే ఇతర రంగానికి సరైన ప్రాధాన్యత కల్పించలేదు. ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు ఒరిగిందేమి లేదు. ఈ దఫా సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపి రంగాల వారీగా కేటాయింపులు చేసినప్పటికీ ఎక్కడెక్కడ ఏయే అంశాలకు ఎంతెంత కేటాయింపులు జరుపుతున్నదీ ఇతమిద్దంగా చెప్పలేకపోయారు. గతంలో రూ.2.5 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి పన్ను చెల్లించాల్సి ఉండగా దానిని రూ.3 లక్షలకు పెంపుదల చేశారు. దీనివల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కలగలేదు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మాటలు తప్ప.. చేతల ప్రభుత్వంలా అన్పించలేదు.

- బొత్స సత్యనారాయణ రాష్ట్ర వైకాపా నేత