ఫోకస్

ఆంక్షలపై సమష్టిగా పోరాటం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ విధించిన, ఇంకా విధిస్తున్న ఆంక్షలను అన్ని పార్టీలూ రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా బాధ్యత ఉంది. ఆంక్షలకు గురైన వివిధ దేశాల అధ్యక్షులతో, ప్రధానులతో కలిసి చర్చించాలి. అవసరమైతే దీనిని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకుని రావాలి. అమెరికాలో ఉగ్రవాదం నిర్మూలన పేరిట ట్రంప్ ఈ ఎత్తుగడ వేశారు. నిజానికి అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశీయుల సంగతి ఎలా ఉన్నా, మన భారతీయులు మాత్రం ఎంతో సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ, ఇతరులను గౌరవిస్తూ జీవిస్తుంటారు. ఇతరుల పట్ల దురుసుగా ఉండడం గానీ, అమర్యాదగా ఉండడంగానీ చేయరు. ఇప్పుడు హెచ్-1బి వీసాలను రద్దు చేయడంవల్ల అమెరికానే నష్టపోతుంది. మన దేశంనుంచి వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది నిష్ణాతులైనవారి సేవలను అమెరికా ఉపయోగించుకుంటున్నది. మన దేశంతోపాటు, మిగతా దేశాలవారూ అమెరికాకు వెళ్ళరాదని కఠిన నిర్ణయం తీసుకుంటే, ఆ దేశ పరిస్థితి ఏమవుతుంది. భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన నిపుణుల సేవలు నిలిచిపోతే అమెరికానే తీవ్ర ఇబ్బందుల పాలవుతుంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాతో సత్సంబంధాలకోసం చొరవ తీసుకోవాలి. లోగడ ఉన్నట్లే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగేలా చూడాలి. ట్రంప్‌తో మంతనాలు జరపాలి. ఇంకా ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలకోసం అనే్వషించాలి. ప్రతిపక్షాలనూ పరిగణలోకి తీసుకుని వారి సలహాలు, సూచనలు తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఇది కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలదే బాధ్యత. అయితే మిగతా పార్టీలూ రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి. ట్రంప్ ఆంక్షలను తొలగించేందుకు ఎటువంటి వత్తిడి తేవాలన్న వ్యూహ రచనలో ప్రతిపక్షాలూ భాగస్వామ్యమై సహకరించాలి. ట్రంప్ ఆంక్షలతో అనేకమంది భారతీయులు వెనుదిరిగితే మన దేశంలో ఇంకా నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. ఇప్పటికే ఎంతోమంది నిరుద్యోగంతో అల్లాడుతున్నారు. కాబట్టి ప్రధాని మోదీ చొరవ తీసుకుని ట్రంప్‌తో రాయభారం చేయాలి.

- వి. హనుమంత రావు, మాజీ ఎంపి, ఎఐసిసి కార్యదర్శి