ఫోకస్

రెండు నెలల్లో సాధారణ స్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో జరుగుతున్న దాని కన్నా మీడియాలో ప్రచారం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ హడావుడి ఒకటి రెండు నెలల్లో సర్దుకుంటుంది. అమెరికా కంపెనీల్లో ఉద్యోగాలు మన వాళ్లకు ఎంత అవసరమో, అమెరికా కంపెనీలకు మనవాళ్లు కూడా అంతే అవసరం. సాంకేతిక నిపుణులను వదులుకునే పరిస్థితిలో అమెరికా కంపెనీలు లేవు. తాత్కాలికంగా ఆందోళన పరిస్థితిలు కల్పించినా, అంతా సర్దుకుంటుంది. విద్యార్థులను వెనక్కి పంపుతున్నారు, ఉద్యోగులను వెనక్కి పంపుతున్నారు అనే ప్రచారంలో వాస్తవం లేదు. సరైన ధ్రువపత్రాలు ఉన్న విద్యార్థులను, ఉద్యోగులను ఎవరినీ పంపడం లేదు. వెనక్కి పంపారు అని మీడియా హడావుడి చేయడం తప్ప ఎందుకు వెనక్కి పంపారు? ఆ వ్యక్తి సాంకేతికంగా చేసిన తప్పులు ఏమిటి? అనేది చూపించరు.
భారతీయులకు సంబంధించి అమెరికాలో ప్రధానమైన సమస్య. ఇప్పటివరకు హెచ్1బి విసాకు కనీస జీతం సంవత్సరానికి ఆరవై వేల డాలర్లు ఉండేది. దాన్ని ఏకంగా లక్షా 30వేల డాలర్లకు పెంచారు. ఇంత జీతం భరించే స్థితిలో కంపెనీలు, క్లయింట్స్ ఉన్నారా? అనేది చూడాలి. కంపెనీలది మధ్యవర్తి పాత్రే. ఉద్యోగులు పనిచేస్తారు, క్లయింట్ ఫీజు చెల్లిస్తారు. మధ్యలో కంపెనీ ఉంటుంది. ఒకేసారి జీతాలు రెట్టింపు చేస్తే కంపెనీలు ఆ మేరకు క్లయింట్ వద్ద వసూలు చేయాలి. కంపెనీలు అమెరికావే, అక్కడి క్లయింట్స్ కూడా అమెరికాకు చెందినవారే. లక్షా 30వేల రూపాయల జీతం చెల్లించాలి అంటే భవనం అద్దె, నిర్వాహణ వ్యయం అంతా కలిసి ఏటా ఒక ఉద్యోగి చేసిన పనికి క్లయింట్ వద్ద కనీసం లక్షా 50వేల డాలర్లు వసూలు చేయాలి. ఇంత భారాన్ని క్లయింట్ మోయలేరు. ఇది అమలయ్యే అవకాశాలు తక్కువ. విప్రో, టిసిఎస్ వంటి పెద్ద కంపెనీలు కూడా అంత వేతనాన్ని చెల్లించడం లేదు. లక్షా 30వేల డాలర్ల జీతం పొందే ఉద్యోగుల సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది. స్పష్టమైన మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తన ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనే విధానం కాదు అమెరికాలో. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను కోర్టు కొట్టేసింది. చివరకు సొంత పార్టీవాళ్లు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఇండియా లాంటి దేశంలో కీలక నిర్ణయాలు నచ్చకపోయినా సొంత పార్టీ నుంచి పెద్దగా వ్యతిరేకత కనిపించదు. కానీ అమెరికాలో మాత్రం సొంత పార్టీవాళ్లే వ్యతిరేకంగా ఓటు వేయవచ్చు. సెనెట్ ఆమోదం పొందాలి. కాంగ్రెస్‌లో మద్దతు లభించాలి. వీసాలకు సంబంధించి ఈ కొత్త ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుందని అనుకోవడం లేదు. ట్రంప్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని మీడియా హైలెట్ చేస్తోంది కానీ ఎందుకు గెలిచారు అనేది కూడా చూడాలి. మైన్స్, ఇనుము పరిశ్రమపై పెద్ద సంఖ్యలో కార్మికులు ఆధారపడి జీవించేవాళ్లు. కంపెనీలకు అనుబంధంగా టౌన్‌షిప్‌లు ఉండేవి. ఇప్పుడు మొత్తం చైనా చేతిలోకి వెళ్లిపోయింది. చివరకు అమెరికాలో ఉక్కు తయారు చేయడం లేదు, చైనానుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇలాంటి విధానాల వల్లనే ట్రంప్‌కు అమెరికా వారినుంచి మద్దతు లభించింది విజయం సాధించారు. భారతీయ వృత్తి నిపుణలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కొత్తగా ఇప్పుడు అమెరికా వెళ్లాలి అనుకునే వారికి కొన్ని రోజులు ఇబ్బంది ఎదురుకావచ్చు.

- శివ రాచర్ల, ఎన్‌ఆర్‌ఐ, అమెరికా