ఫోకస్

ఆభిజాత్యానికి నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్1బి వీసాలపై ఆంక్షలు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆభిజాత్యానికి నిదర్శనం. అగ్రరాజ్యమైన అమెరికాకు మొదటినుంచి ఆసియా, ఆఫ్రికా ఖండాలంటే చిన్నచూపే. ట్రంప్‌కు ముందు తొలిసారి ఒక నల్లజాతీయుడు అమెరికా అత్యున్నతి పదవి అలంకరించడానికి కారణం కూడా ఇదే. ఇక అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. అగ్రరాజ్యం అమెరిక ఒక్కటే ప్రపంచాన్ని శాసించాలనే కుతూహలాన్ని ట్రంప్ తన చర్యల ద్వారా నిజం చేస్తున్నాడు. న్యాయ వ్యవస్థపై ఏమాత్రం నమ్మకం లేని అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఒంటెత్తు పోకడలకు నిదర్శనం. హెచ్1బి వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుని హోదాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భారత్‌సహా పలు దేశాల విద్యార్థులు, ఉద్యోగుల జీవితాలు సందిగ్ధంలో పడే ప్రమాదం లేకపోలేదు. అమెరికా యేతరులు అక్కడ ఉద్యోగావకాశాలు పొందేందుకు కనీస జీతం సాలీనా 65వేల యుఎస్ డాలర్లను 1.3 లక్షల యుఎస్ డాలర్లకు పెంచడం వల్ల భారత్‌సహా పలు దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లినవారు ఇబ్బందుల్లో పడతారు. తద్వారా ఇతర జాతీయులను దేశం నుంచి వెళ్లగొట్టడంతోపాటు స్వదేశీయులకే ఉద్యోగావకాశాలు కల్పించుకునే కుట్రకు ట్రంప్ నిర్ణయం దోహదపడుతుంది. ఇది ఒక రకంగా అమెరికాను కూడా ఇబ్బందుల్లో పడేసే ప్రమాదం లేకపోలేదు. అతితక్కువ జీతానికి పనిచేస్తున్న అమెరికా యేతర పౌరులను దేశంనుంచి వెళ్లగొట్టే ప్రయత్నంగా చెప్పవచ్చు. ప్రపంచం అంతా ఏకతాటిపై ఉండాల్సిన తరుణంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు విపరీత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వసుదైక స్పూర్తికి ఇది పూర్తి విరుద్ధంగా చెప్పకతప్పదు. అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న పలు నిర్ణయాల పట్ల స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రపంచలో కొన్ని దేశాల్లో అమెరికా పట్ల నెలకొన్న సానుకూల ధృక్పథం కూడా ట్రంప్ వ్యవహరించే తీరుతో సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఇక అగ్రరాజ్యమైన అమెరికా కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న వివాదస్పద నిర్ణయాలు అమెరికాపై విపరీత ప్రభావాన్ని చూపుతాయనడంలో సందేహం లేదు.

-ప్రొఫెసర్ బాబీ వర్ధన్ ఎయు జర్నలిజం విభాగాధిపతి