ఫోకస్

విద్యారంగానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఉద్యమ కాలంనుంచి విద్యారంగం ఏ విధంగా ఉండాలనే దానిపై ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగారికి ఒక అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే కేజీ టూ పీజీ వరకు ఉచిత పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం అమలులో తొలి దశగా ఒకేసారి 119 గురుకుల పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ప్రారంభంలో ప్రైవేటు భవనాల్లో వీటిని ప్రారంభించినా, ఏడాదిలో సొంత భవనాల నిర్మాణం జరుగుతుంది. నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల ఒకేసారి ప్రారంభించడం అంటే సాధారణ విషయం కాదు. దేశంలో ఎక్కడా ఈ విధంగా జరగలేదు. విద్యారంగంపై చేసిన వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికోసం చేసిన వ్యయంగా చూడాలి. తెలంగాణను విద్యా రంగంలో నిర్లక్ష్యం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య తెలంగాణ విద్యార్థులకు అందాలి అనేది ప్రభుత్వ ధ్యేయం దానికోసమే కృషి జరుగుతోంది. పెద్దఎత్తున ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ సాగుతోంది. గురుకుల పాఠశాలల కోసం ఒకేసారి ఏడువేల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ ప్రక్రియ మొదలైంది. పేదవారికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో గురుకులాలు ప్రారంభం అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల కన్నా గురుకులాల్లో ఉత్తీర్ణతా శాతం ఎక్కువగా ఉంది. నాణ్యమైన విద్య అందుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. గతంలో పాఠ్యపుస్తకాలకు సమస్య ఉండేది. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచేట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇంగ్లీష్ మీడియంలో సిబియస్‌ఇ సిలబస్ బోధిస్తారు. వివిధ ప్రైవేటు విద్యా సంస్థల్లో దాదాపు 20లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 40లక్షల మంది విద్యార్థులకు గురుకుల పాఠశాలలద్వారా నిర్బంధ విద్య అందించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు అంశాన్ని క్యాబినెట్ సబ్‌కమిటీ పరిశీలిస్తోంది. విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు టాస్క్‌ద్వారా నైపుణ్య శిక్షణకు ప్రాథాన్యత ఇస్తున్నారు. పాఠశాలల్లో కనీస వసతులు కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. త్వరలోనే పదివేల మంది ఉపాధ్యాయుల నియామకానికి కసరత్తు సాగుతోంది.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్