ఫోకస్

పేదలకు విద్య అందని ద్రాక్షే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ విద్యా హక్కు కల్పించినప్పటికీ ఆచరణలో అవి అందని ద్రాక్షగానే మారుతున్నాయి. నేటికి ప్రాథమిక విద్యకు నోచుకోని వారెందరో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మోడల్ స్కూళ్ల ఏర్పాటు పేరిట 1400 పాఠశాలలు మూసివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బడిఈడు గల పిల్లలు 86.50 లక్షల మంది ఉండగా, బడిలో 73.12 లక్షలు మంది చదువుతున్నారు. మిగిలిన 13.37 లక్షల మంది ఎక్కడ ఉన్నారన్నదీ ప్రభుత్వ లెక్కల్లో కూడా స్పష్టత కన్పించడం లేదు. దేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుండగా మన రాష్ట్రం ప్రాథమిక విద్యలో 35వ స్థానంలో ఉండటం గమనార్హం. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం నడుపుతున్న పాఠశాలలు 63, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నవి 3656, మండల, జిల్లా పరిషత్ యాజమాన్యంలో నడుపుతున్నవి 40295, మున్సిపల్ పాఠశాలలు 2123, ఎయిడెడ్ పాఠశాలలు 2302, గిరిజన ప్రాంతం లో గిరిజన సంక్షేమశాఖ నడుపుతున్న పాఠశాలలు ఉన్నాయి. ఇవిగాకుండా ప్రైవేటు యాజమాన్యంలో 12689 పాఠశాలలు కలిపి మొత్తం 62వేల పైచిలుకు ఉన్నాయి.
ఈ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు నోచుకోనివి వేలల్లో ఉండటం గమనార్హం. ప్రధానంగా మరుగుదొడ్లకు నిరంతర నీరు సరఫరా లేకపోవడంతో వాడుకలో కన్పించడం లేదు. గిరిజన ప్రాంతంలో బాలికల ఆశ్రమ పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు లేక సమీప గెడ్డలు, వాగులపై ఆధారపడుతున్నారు. గిరిజన ప్రాంతంలోని పాఠశాలలకు కూడా కనీసం ప్రహరీగోడలు లేకపోవడం అత్యంత దారుణం. ఉన్నతపాఠశాలల్లో నైట్‌వాచ్‌మెన్లు, బోధనేతర సిబ్బంది లేకపోవడం వల్ల రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ పని ఉపాధ్యాయులపై అదనపు భారంగా తయారైంది. సిసిఈ విధానం ప్రవేశపెట్టడంవల్ల ఉపాధ్యాయులపై రాతపని ఎక్కువ, బోధన సమయం తగ్గింది. ఇక మధ్యాహ్నా భోజన పథకం నిర్వహణకు తమిళనాడు తరహాలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. యాశ్‌పాల్ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ పుస్తకాల భారం తగ్గలేదు. సిసిఈ విధానం అమలు చేస్తున్నప్పటికీ పుస్తకాల మోత తగ్గలేదు. ఇక ప్రైవేటు పాఠశాలల విషయానికి వస్తే ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వాటికి ప్రభుత్వ నిబంధనలు అమలయ్యే విధంగా కమిటీలను నియమించి చర్యలు చేపట్టాలి.
కొఠారి కమిషన్ సూచించిన విధంగా విద్యా రంగానికి బడ్జెట్‌లో 30 శాతం కేటాయింపులు చేయాలి. అన్ని పాఠశాలలకు తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీగోడలు, బోధన, బోధనేతర సిబ్బంది సరిపడినంత మందిని నియమించాలి. అన్ని పాఠశాలలకు డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీసు రూల్స్, ప్రభుత్వ పింఛను ఇవ్వడం వంటి వౌలిక సమస్యలు పరిష్కరించాలి. వృత్యంతర శిక్షణ వేసవి కాలంలో అవసరమైనన్ని రోజులు ఉపాధ్యాయులకు అందించాలి.

- డి.రాము యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి