ఫోకస్

చిత్తశుద్ధి లోపించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిధులు, నీళ్లు, నియామకాలు... ఈ ట్యాగ్‌లైన్‌తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం ఉద్యమం జరిగింది. ఏన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం అవతరించటంతో నిధుల సమస్య దానికంతకు అదే తీరిపోయింది. తెలంగాణ ప్రాంత ఆదాయ వనరులన్నీ సొంత రాష్ట్రానికే దక్కడంతో ఈ సమస్య పరిష్కారం అయిపోయింది. ఇక విషయానికి వస్తే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏటా రూ.25 వేల కోట్ల నిధులను సాగునీటి రంగానికి కేటాయిస్తోంది. గోదావరి, కృష్ణా నదులలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా మేరకు జలాలను వినియోగించుకునే విధంగా ప్రాజెక్టులను నిర్మించుకుంటున్నాం. పూర్తిస్థాయిలో నీటి వాటాలను వినియోగించుకునేందుకు కొన్ని ప్రాజెక్టులకు ప్రభుత్వం రీడిజైనింగ్ కూడా చేస్తోంది. ఇక మిగిలింది తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌లోని మరో ప్రధానంశం నియామకాలు. ప్రభుత్వం ఈ అంశం పట్ల సరైన శ్రద్ధకనబర్చడం లేదనే చెప్పవచ్చు. రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత ఎంతో ఆశపడింది. దశాబ్దాల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. కనీసం సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాతైనా నియామకాలు జరుగుతాయని ఆశించిన యువతకు నిరాశే ఎదురైంది. రాష్ట్రం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఏడాదికి పది వేల పోస్టులు అయినా భర్తీ కాలేదు. ఇక మిగిలిన రెండు సంవత్సరాలలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తారన్న విశ్వాసం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. నియామకాల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనడానికి ఇక్కడో ఉదాహరణ గుర్తు చేసుకోవాలి. 11వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు 2015 డిసెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడితే ఆ ఫలితాలు 2017 ఫిబ్రవరి నెలాఖరున ప్రభుత్వం విడుదల చేసింది. అదికూడా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేపట్టిన ఆందోళనతో బెంబేలు ఎత్తి అప్పటికప్పుడు ఏడాదిన్నర కిందటి ఫలితాలను వెల్లడించాల్సి వచ్చింది. నిరుద్యోగ యువత, ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం కనబరుస్తున్న నిర్లక్ష్య ధోరణికి ఇంతకంటే మరో ఉదాహరణ ఏమి కావాలి. ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు శ్రద్ధ కనబర్చడం లేదు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టువుగా ఉన్న అంశాలపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? దీనివల్లనే రాష్ట్ర యువతలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి.

- డాక్టర్ రాజ్ సిద్ధార్థ రిటైర్డు ప్రొఫెసర్, కాకతీయ వైద్య కళాశాల