ఫోకస్

నిరుద్యోగ సమస్య తీరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారు తెలంగాణలో మన ఉద్యోగాలు మనకే, ఉద్యోగం ఖాళీ అనే మాటే వినిపించదు అంటూ ఒక పార్టీ, జాబు కావాలంటే బాబు రావల్సిందే అంటూ మరో పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టి ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో అధికారిక లెక్కల ప్రకారం నిరుద్యోగుల సంఖ్య 30 లక్షలు, వీరంతా వివిధ ఎంప్లాయిమెంట్ ఎక్సైంజిల్లో నమోదు చేసుకున్నవారే. తెలంగాణలో అధికారిక లెక్క 11,68,235 మంది నిరుద్యోగులు. ఇక తమ పేరును నమోదు చేసుకోనివారు కూడా లక్షల్లోనే ఉన్నారు. తాజాగా రెండు రాష్ట్రాల్లో ఎంప్లాయిమెంట్ ఎక్సైంజి అనే మాట వినిపించకుండా దాని పేరు మార్చే ప్రయత్నం చేశారు. ఎపిపిఎస్‌సి ఆన్‌లైన్‌లోనూ, తెలంగాణ పబ్లిక్ సర్వీసు ఆన్‌లైన్‌లోనూ కలిపి పది లక్షల మంది ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారు. రెండు పబ్లిక్ సర్వీసు కమిషన్లు గత రెండున్నరేళ్లుగా నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌లలో భర్తీ చేసిన పోస్టులు 10వేలు దాటలేదు. దాంతో నిరుద్యోగం అనేది రాజకీయ అంశంగా మారిపోయింది. ఎన్నికల్లో గెలవడానికి ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీని ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు నిలుపుకోలేకపోయారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఖాళీలు అన్నీ భర్తీ చేస్తాం అనే మాటను తెలంగాణలో కె చంద్రశేఖరరావు నిలుపుకోలేకపోయారు. ఉద్యోగం అంటే ఎటిఎం సెంటర్‌లో డబ్బులు తీసుకోవడం కాదు అంటూ ఒక అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారానే్న రేపాయి. నిరుద్యోగులున్నారు.. ఉద్యోగాలు ఉండాలి కదా అంటున్న ప్రభుత్వాలకు నిరుద్యోగ, యువజన సంఘాల నాయకులే గట్టి సమాధానం చెబుతున్నారు. తెలంగాణలో 2014 నాటికే ఖాళీల సంఖ్య 1,07,714 కాగా ఆంధ్రాలో 2014 నాటికే ఉద్యోగాల ఖాళీల సంఖ్య 2,12,011 ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నా రోజురోజుకూ నిరుద్యోగుల ఒత్తిడి అయితే బాగా పెరుగుతోంది. తెలంగాణలో కోదండరామ్ ఉద్యమంతో, శాంతి ర్యాలీతో పెద్ద వివాదమే చెలరేగింది. నిజానికి రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. తెలంగాణ మిగులు రాష్ట్రంగా ప్రచారం జరుగుతున్నా అదే వాస్తవం అయితే ఉద్యోగాల భర్తీకి ఈ సాచివేత ధోరణి ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక లక్ష ఉద్యోగాలను కొత్తగా కల్పించాలంటే నెలకు ప్రభుత్వంపై పడే భారం దాదాపు 400కోట్లు అవుతుందని ఆర్థికవేత్తలు లెక్కలు చెబుతున్నారు. వాస్తవానికి సమాజంలో అన్ని రకాల సమస్యలకు పరిష్కారం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే అని సామాజికవేత్తలు చెబుతున్నారు. అందరికీ ఉపాధి దొరికినపుడే ఏ ప్రాంతం అయినా అభివృద్ధి సాధిస్తుందని వారు చెబుతున్నారు. తాజాగా ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలూ ఉద్యమబాట పడుతున్న నేపథ్యంలో కొంతమంది నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.