ఫోకస్

హింసను ఇస్లాం అంగీకరించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లాం మతం ఉగ్రవాదాన్ని అంగీకరించదు. ఇస్లాం మతంలో మానవతా విలువలు ఉన్నాయని, ఉగ్రవాదాన్ని ఈ మతం తిరస్కరిస్తుందని మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ బహిరంగంగా చేసిన ప్రకటనను మన దేశంలోని ముస్లింలు, మైనారిటీ పార్టీల నేతలు, ముస్లిం మతపెద్దలు గమనించాలి. హైదరాబాద్‌తోసహా తెలంగాణలోని కొన్ని పట్టణాల్లో ఉగ్రవాద నీడలున్నాయి. కరడుగట్టిన ఉగ్రవాదులు పంజావిసురుతున్నారు. దాంతో అనేకమంది యువత ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. సంఘవిద్రోహ శక్తులను ప్రోత్సహించేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. మతం రంగు ఉగ్రవాదానికి పులమవద్దు. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఉగ్రవాదం భయపెడుతోంది. గతంలో కొన్ని దేశాలకే పరిమితమైన ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు పాకింది. ఉగ్రవాదంవల్ల తీవ్రమైన ముప్పు పొంచిఉండటం, ప్రజల ప్రాణాలకు భద్రత కరువవడంతో అన్ని దేశాలు ఐక్యంగా ఉండాలి. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు కఠినంగా వ్యవహరించాలి. మత పెద్దలంతా ఉగ్రవాదాన్ని ఖండించాలి. ఉగ్రవాదాన్ని తమ మతం అంగీకరించదంటూ ఇస్లాం మతపెద్దలు ప్రకటిస్తే మంచి స్పందన వస్తుంది. అలా ప్రకటిస్తే, ఇస్లాం మతం ఉగ్రవాదాన్ని అంగీకరించదన్న సందేశం సమాజంలోకి వెళుతుంది. ఇస్లాం మతపెద్దలతోపాటు ఇస్లాం దేశాలన్నీ మలేషియా ప్రధాన మంత్రి చేసిన ప్రకటనను గమనించాలి. అనేక ఉగ్రవాద సంస్థలు అమాయకమైన యువతను లోబరచుకుంటున్నాయి. యువతకు మాయమాటలు చెప్పి టెర్రరిస్టులుగా మార్చేస్తున్నాయి. యువతను ప్రలోభపెడుతుండటం, అనేక మార్గాల్లో ఆకర్షిస్తుండటంతో ఇస్లాం యువతలో కొంతమంది ఉగ్రవాదులుగా మారేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ విధానంలో మార్పు రావాలి. ఉగ్రవాదుల పట్ల కఠినంగా ఉండేలా చట్టాలను రూపొందించుకోవాలి. రహస్యంగా కానీ, బహిరంగంగా కానీ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారిని కూడా కఠినంగా శిక్షించేవిధంగా మన చట్టాలను రూపొందించాలి. ఉగ్రవాదులు శిక్షణా శిబిరాలను నడిపేందుకు, ప్రోత్సహించేందుకు ఏ దేశం కూడా అనుమతించకూడదు. భారతదేశంలో కొన్ని పట్టణాలు, నగరాలు ఉగ్రవాద కేంద్రాలుగా మారిపోయాయి. ఇంటెలిజెన్స్ విభాగం చురుకుగా పనిచేస్తూ, ఇలాంటి గ్రూపుల ఆటకట్టించాలి. సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టించేందుకు సమాజం కూడా నడుం కట్టాలి. ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగినా అమాయకులే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిలో మార్పురావాలి. సమాజంలో ప్రశాంత వాతావరణం ఏర్పడేలా, శాంతి, భద్రతలను కాపాడటంతో ప్రభుత్వాలు చొరవ చూపాలి. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి.

- అన్నదానం సుబ్రహ్మణ్యం జాయింట్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఆర్‌ఎస్‌ఎస్