ఫోకస్

జాబ్ పాలసీ రూపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ నిర్వాకం, పని తీరుకు విశ్వ విద్యాలయాలు అద్దం పడుతున్నాయి. విశ్వ విద్యాలయాల విద్యార్థుల్లో అసహనం కనిపిస్తున్నది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల విధానం మారాలి. ఎలా మారాలంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాకుండా కెరీర్ ఓరియంటెడ్ కోర్సులను ప్రవేశపెట్టాలి. విద్యార్థులు విశ్వ విద్యాలయాల నుంచి బయటకు రాగానే, తాను అభ్యసించిన, ఉత్తీర్ణుడైన కోర్సులకు అనుగుణంగా ఉద్యోగం లేదా ఉపాధి అవకాశం లభించేలా ఉండాలి. విశ్వ విద్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత నిరుద్యోగిగా కాలం గడిపే రోజులు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాయి. ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వం-వర్సిటీలు లింక్ ఏర్పాటు చేసుకోవాలి. అనేక ప్రభుత్వరంగ, ప్రైవేటు రంగాల్లో వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. నిరుద్యోగులూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయినా ఆ ఉద్యోగాలు ఎందుకు భర్తీ కావడం లేదంటే, ఆ సంస్థలకు కావాల్సిన నైపుణ్యం ఉన్న అభ్యర్థులు లభించడం లేదు. ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వం చొరవ తీసుకుని జాబ్ పాలసీని రూపొందించాలి. విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యతోపాటు నైతికతపైనా బోధన జరగాల్సిన అవసరం ఉంది. సమాజానికి అది ముఖ్యం. కాబట్టి ప్రభుత్వాలు దానిపై ప్రాముఖ్యతనివ్వాలి. ఉన్నతమైన విద్యనార్జించినవారి ప్రవర్తన కూడా ఉన్నతంగా ఉండాలి. దీనిని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోరాదు. తాను అందరిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం లేదు. కొంత మంది దురుసు ప్రవర్తన ఉంటుందన్న భావనతో అంటున్నాను. సమాజంలో ఉన్నత విద్యావంతులు బాధ్యతతో ఉంటారు. అయితే కొంతమంది విద్యార్థుల్లో అసహనం కనిపిస్తున్నది. ఫలితంగానే ఆందోళనలు అధికమవుతున్నాయి. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు, సంఘీభావం ప్రకటించేందుకు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇటువంటివి ఉద్రిక్తతకు దారితీస్తుంది. దీనిని అణచి వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే, ఇంకా ఆందోళనలు తీవ్రతరమై విధ్వంసానికి దారితీస్తాయి. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ‘జాబ్ క్యాలెండర్’ను ప్రకటించి ఉంటే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. గ్రూపు-1, గ్రూపు-2 ఇలా పరీక్షల తేదీలను, ఇంకా డిఎస్‌సి వంటి పరీక్షల తేదీల క్యాలెండర్‌ను ప్రకటించి, ఆ ప్రకారం నియామకాలు చేపడితే నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్లపైకి ఎందుకు వస్తారు? కాబట్టి ప్రభుత్వం అన్ని విధాలా ఆలోచించి సరైన చర్యలు చేపట్టాలి. ఇంకా అవసరమైతే అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.

సి.వంశీచంద్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే