ఫోకస్

విద్యావ్యవస్థలో పైరవీలే ఆందోళనలకు మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను ఉపకులపతులుగా నియమించటం, కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకుల నియామకాలు దశాబ్ధాలుగా కొనసాగించటం, అడ్మిషన్లతోనే విద్యార్థులకు ఏదో జరిగిపోయిందనే అభిప్రాయం ప్రభుత్వాలకు ఉన్నంతకాలం విశ్వవిద్యాలయాలలో అశాంతి కొనసాగక తప్పదు. ఒకప్పుడు ఒక లక్ష్యం, స్వయం నిర్ణయం తీసుకునే శక్తి కలిగిన వ్యక్తులు ఉపకులపతులుగా నియమితులైనందువల్ల యూనివర్సిటీలకు ఎంతో గుర్తింపు వచ్చింది. కానీ ఉపకులపతులుగా తమవారిని, కీలుబొమ్మలుగా వ్యవహరించేవారిని పెట్టుకోవాలనే ఆలోచన ప్రభుత్వాల్లో పెరగటం, అదేస్థాయిలో ఉపకులపతి పదవులకోసం పైరవీలు పెరిగిన పరిస్థితుల్లో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టి విశ్వవిద్యాలయాల్లో అశాంతి పెరిగిపోతోంది. జనాకర్షక పథకాలకు, ఓటుబ్యాంకు పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వాలు, కీలకమైన విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఫలితంగా విద్యారంగానికి కేటాయింపులు, విశ్వవిద్యాలయాలకు అందే గ్రాంట్లు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో నడిచే స్కూళ్ల మాదిరిగా విశ్వవిద్యాలయాల పరిస్థితి తయారయింది. ప్రభుత్వ ఒత్తిడి, రాజకీయాల కారణంగా విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సొంతగా ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేకుండాపోయాయి. ప్రతి విషయానికి ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చించాకే నిర్ణయం తీసుకోవలసిన దుస్థితి ఏర్పడింది. అకడమిక్ లిబర్టీ, ఆడ్మినిస్ట్రేటివ్ లిబర్టీ లేకుండా పోయింది. ప్రభుత్వం ఇచ్చే నిధులు అధ్యాపకుల జీతాలు, నామమాత్ర అవసరాలకు సరిపోతున్నాయి. ఫలితంగా నియామకాలు, లైబ్రరీ, ల్యాబ్, పరిశోధనలు, స్కిల్ డెవలప్‌మెంట్ తదితర అవకాశాలు లేకుండాపోయాయి. డబుల్ పిజిలు, డబుల్ డాక్టరేట్లు చదివినా కూడా సరైన ఉద్యోగావకాశాలు లభించని పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా అటు అధ్యాపకవర్గాల్లో, ఇటు విద్యార్థుల్లో భవిష్యత్తుపై అపనమ్మకం, అనిశ్చితి పెరగటంతో విశ్వవిద్యాలయాలో ఉపకులపతులు, అధ్యాపకులు, విద్యార్థుల మధ్య నిత్యం వాగ్వివాదాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. వీటికి వివిధ వర్గాలు వివిధ రంగులు పులిమి తమ వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటన్నింటికి విరుగుడు నిజాయితీ, నాయకత్వ లక్షణాలు ఉన్న అధ్యాపకులను ఉపకులపతులుగా నియమించటం, అవసరాల మేరకు అధ్యాపకులను రెగ్యులర్ పద్ధతిన నియమించటం, విద్యార్థులకు విద్యాపరంగా అవసరమైన సదుపాయలు కల్పిస్తే విశ్వవిద్యాలయాల్లో ఉద్రిక్తతను, అశాంతిని నివారించేందుకు అవకాశం ఉంటుంది.

- ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ రిటైర్డ్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ