ఫోకస్

సమస్యల పరిష్కారం వైస్‌చాన్సలర్ల బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయాల్లో అశాంతి లేకుండా ఉండాలంటే విద్యార్థులు పాజిటివ్ దృక్పధంతో ఆలోచించేలా వారిని తీర్చిదిద్దాలి. చదువులో పోటీతత్వం పెంచాలి. విద్యార్థులు చదువు కాకుండా ఇతర వాటిపై దృష్టి మరల్చకుండా ఉండేందుకు నిరంతరం వారు చదువు, క్రీడలు తదితర వాటిపై నిమగ్నమయ్యేలా అనువైన వాతావరణాన్ని కల్పించాలి. దీనివల్ల వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులు కాగలుగుతారు. తద్వారా పాజిటివ్ దృక్పథం అలవడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఏ చిన్న సమస్య ఎదురైనా వాటిపై వైస్ ఛాన్సలర్ స్పందిస్తూ వాటికి పరిష్కారాలను చూపాలి. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా వాటిని ఎదుర్కొనేందుకు వైస్‌ఛాన్సలర్ సిద్ధంగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలకు కూడా పోలీసులపై ఆధారపడకూడదు. విద్యార్థులు ప్రతిరోజు తరగతులకు హాజరయ్యే విధంగా చూడటం, పాఠాలు సక్రమంగా బోధించేలా చర్యలు చేపట్టాలి. విద్యార్థులందరు తరగతులలో ఉండేలా గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రొఫెసర్లు, అధ్యాపకులు వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా చూడాలి. నిరంతరం వారిని పర్యవేక్షిస్తూ ఉండాలి. విశ్వవిద్యాలయంలో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అక్కడే తిష్ట వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా నాన్‌బోర్డరు విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో తిష్టవేసి చిన్న, చిన్న సమస్యలకు కూడా రోడ్డెక్కే పరిస్థితి కల్పిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులపై పోలీసు కేసులు నమోదు కావడం, ఇతరత్రా సమస్యలు ఎదురవుతున్నాయి. అందువల్ల నాన్‌బోర్డర్లు విశ్వవిద్యాలయాల్లో లేకుండా చేయాలి. విశ్వవిద్యాలయాల్లో కోర్సులు పూర్తిచేసిన వెంటనే విద్యార్థులు ఆయా హాస్టళ్లను ఖాళీచేసే విధంగా నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. విశ్వవిద్యాలయాల హాస్టళ్లను పర్యవేక్షించేందుకు ఒక కార్యదర్శిని నియమించాలి. మరోపక్క ఏ చిన్న సమస్య తలెత్తినా వైస్ ఛాన్సలర్ స్పందించి దానికి పరిష్కారాన్ని అందించగలగాలి. విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులకు ప్లేస్‌మెంట్ లభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలి. కోర్సు పూర్తిచేసిన వారికి ఉపాధి కలుగుతుందన్న నమ్మకం పెంచాలి. అందుకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో కల్పించాలి. విద్యార్థులకు కర్రిక్యులర్, కోకర్రిక్యులర్ యాక్టివిటీస్‌లో శిక్షణనివ్వాలి. ప్రతి విద్యార్థి రోజు క్రీడల్లో పాల్గొనే విధంగా చూడాలి. విద్యార్థులకు అవసరమైన రంగాల్లో నిపుణులతో శిక్షణలు ఇప్పించడం, సదస్సులు నిర్వహించాలి. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి. సకాలంలో పరీక్షలు నిర్వహించని సందర్భాలలో విద్యార్థుల్లో ఒక రకమైన అలసత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే విశ్వవిద్యాలయాల్లో అశాంతి అనే సమస్య ఉత్పన్నం కాదు.

-ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు, వైస్ ఛాన్సలర్, సెంచూరియన్ వర్శిటీ