ఫోకస్

బ్యాంకుల భారం ప్రజలపైనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి బ్యాంకులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు. నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి నష్టాల నుంచి గట్టెక్కేందుకు బ్యాంకులు ఇష్టారాజ్యంగా వినియోగదారులపై వివిధ చార్జీల పేరుతో భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ప్రజలు, వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలంటే సామాన్యులే కాదు.. వ్యాపారులు కూడా వెనుకంజ వేస్తారు. 60 శాతం బ్యాంకుల లావాదేవీలు గ్రామాల నుంచే జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్యాంకులవల్ల తమకు నష్టం కలుగుతుందని తెలిస్తే లావాదేవీలు తగ్గిపోతాయి. దీనికితోడు వ్యాపారులు తమ నష్టాన్ని ప్రజలపై వేసి రాబట్టుకునే ప్రయత్నం చేసే ప్రమాదం ఏర్పడుతుంది. నిబంధనల పేరుతో వినియోగదారులపై ఎడాపెడా భారం మోపడం సరైంది కాదు. డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించడం, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్‌టి) విధానం అమలు వంటి వాటికి ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. సింగపూర్ లాంటి దేశాల్లో సైతం పూర్తిస్థాయిలో క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ అమలు సాధ్యం కాలేదు. డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడినవారు ఎలాగూ కొనసాగిస్తారు. అయితే ప్రజలందరినీ అలవాటు చేసే క్రమంలో వారిపై చార్జీల భారం, వ్యాపారులపై బ్యాంకులు కమిషన్ల బరువు మోపడం సరైంది కాదు. జిఎస్‌టి అమలు చేసి, బ్యాంకుల్లో లావాదేవీలు కొనసాగించాలి. తద్వారా పారదర్శకతతోపాటు అధిక వస్తూత్పత్తి జరుగుతుంది. వెరసి జిడిపి కూడా పెరుగుతుంది. తద్వారా ప్రభుత్వానికీ ఆదాయం సమకూరుతుంది. పారదర్శకంగా లావాదేవీలుండేలా, వ్యాపారులపైనా కమీషన్లు, చార్జీల భారం పడకుండా చూడాలి. తక్కువ మార్జిన్ పెట్టినట్లయితే 30 శాతం లావాదేవీలు పెరుగుతాయి. వ్యాపారులపై భారం వేస్తే.. తమ లాభాలకోసం ఆ నష్టాన్ని ప్రజలపై మోపే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు బ్యాంకుల్ని నియంత్రించాల్సి ఉంది.

-శేషాంజనేయులు అధ్యక్షుడు, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్, అనంతపురం