ఫోకస్

సుప్రీం పరిష్కారమే శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవడం సాధ్యం కాని పని..న్యాయ స్థానంలోనే దీనిని పరిష్కరించడం శ్రేయస్కరం. ఏ వర్గమూ, పక్షమూ వ్యతిరేకించినా ఆ వివాదం కాస్తా మళ్ళీ కోర్టులోనే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఎప్పటికైనా తిరిగి తిరిగి మళ్ళీ కోర్టుకు రావాల్సిన పరిస్థితే..దీనికి బదులు ఇపుడే కోర్టులో పరిష్కరించుకుంటే మేలని నా అభిప్రాయం. అధ్వాని రధయాత్ర వల్ల పరిష్కారం కాకపోవడం వల్లే కోర్టుకెక్కిన వివాదం మళ్ళీ కోర్టు బయట పరిష్కరించడమనేది సాధ్యమయ్యే పని కాదు. న్యాయ స్థానం నిర్ణయాన్ని, తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. బయట పరిష్కరించుకోవాలంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని భావిస్తాను. బయట పరిష్కారం కాకపోతే ఎప్పటికైనా మళ్ళీ సుప్రీం కోర్టు పరిష్కరించాల్సిందే. బయట పరిష్కరించుకోవడమంటే వ్యతిరేకించే పక్షమూ వుంటుంది, స్వాగతించే పక్షమూ వుంటుంది అటువంటపుడు కోర్టే పరిష్కరిస్తే అన్ని పక్షాలూ ధర్మ స్థానం తీర్పునకు కట్టుబడి వుండాలి కాబట్టి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు మంచి ఉద్ధేశ్యంతోనే చెప్పినప్పటికీ ఒక వర్గం అంగీకరించదు, అపుడైనా ఈ అంశం కోర్టుకు రావాల్సిందే. ఈ క్రమంలో తీవ్ర జాప్యానికి కూడా అవకాశం వుంది. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం లభించదు. హిందువులకు వ్యతిరేకంగా వచ్చినా, అనుకూలంగా వచ్చినా సుప్రీం కోర్టు తీర్పునకు ఎవరూ అతీతులు కారు, కాబట్టి ఏ పక్షమైనా న్యాయ స్థానం తీర్పునకు బద్దులై వుండాలి కాబట్టి కోర్టు పరిష్కారమే శ్రేయస్కరమని అభిప్రాయపడుతున్నాను.

-పోతుకూచి సూర్యనారాయణమూర్తి సీనియర్ న్యాయవాది, రాజమహేంద్రవరం