ఫోకస్

హామీలు అమలు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో వాగ్దానం చేస్తే దానిని తు.చ. తప్పకుండా అమలుచేయాలి. అందువల్లనే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసేముందు అది సాధ్యమా, కాదా అన్నది పరిశీలించుకోవాలి. ఒకవేళ ఇచ్చిన వాగ్దానం అమలు చేసేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని అమలుచేసి తీరాల్సిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలి. సుప్రీం కోర్టు నిబంధనల మేరకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించరాదని పేర్కొన్నందున, వారిని బిసిలుగా గుర్తించి వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆ దిశగా రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వేకూడా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయం గుర్తుంచుకోవాలి. అప్పటి పరిస్థితులను బట్టి బిసిల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించారు. అలా చేయడంవల్ల ఎలాంటి నష్టం ఉండదు. దీనివల్ల దేశానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఒక రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే, మిగిలిన ప్రాంతాల్లో కూడా వారు డిమాండ్ చేసి రిజర్వేషన్లు పొందే వీలు కలుగుతుంది.

- బొత్స సత్యనారాయణ వైకాపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు