ఫోకస్

ఓటు బ్యాంకు రాజకీయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన ప్రయత్నమే ఫలించలేదు. దీంతో ఒక శాతాన్ని తగ్గించి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాం. ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకంగా 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని ఇచ్చారు. 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మంచిదే కానీ అందుకు రాజ్యాంగం ప్రకారం వీలుపడడం లేదు. 12 శాతం అన్నది కూడా కెసిఆర్ ఎత్తుగడలో భాగమే. అంతా సాఫీగా జరిగిపోతే అది తన గొప్పతనంగా కెసిఆర్ చెప్పుకుంటారు. ఏవైనా ఆటంకాలు ఎదురైనా, న్యాయపరమైన చిక్కులు, సమస్యలేవైనా ఎదురైతే అందుకు అవతలి వారిపై నెట్టి వేసి రాజకీయపబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. రిజర్వేషన్లు కల్పించేందుకు తాము విశ్వ ప్రయత్నం చేశాం కానీ చివరకు ఫలానా పార్టీ రిజర్వేషన్లను అడ్డుకున్నదని బురద చల్లి రాజకీయ లబ్ది పొందాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లతో సంబంధం లేకుండానే వారిని ఆదుకునేందుకు అవకాశం ఉంది. వివిధ చిన్నా, చితక వ్యాపారం చేసుకుంటున్న పేద ముస్లింలకు రుణాలు ఇప్పించి ఆదుకోవచ్చు. సచార్ కమిటీ సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే విద్యాపరంగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాటిని పక్కన పెట్టి పండుగల సందర్భంగా దుస్తుల పంపిణీ, వివిధ నిత్యావసర వస్తువుల పంపిణీ చేసి వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ తాత్కాలికమే అవుతాయి, కానీ వారు ఆర్థికంగా నిలబడేందుకు దోహదపడవు. కాబట్టి రాజకీయ ఎత్తుగడలు మాని చిత్తశుద్ధితో ముస్లింల అభ్యున్నతికి కృషి చేయాలి.

- గండ్ర వెంకటరమణా రెడ్డి మాజీ ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు