ఫోకస్

ముస్లింలకు రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో రిజర్వేషన్ల అంశం మరోమారు విస్తృత చర్చకు కారణమైంది. ప్రభుత్వం ఎన్నికల ప్రలోభాలు పెడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణ తీరుపై ఆంధ్రా దృష్టిపెట్టింది. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా కొన్ని జాతులను ఉద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్లు కాలక్రమంలో ఆర్థికంగా వెనుకబడిన కులాలకు, నిమ్నవర్గాలకు విస్తరించారు. తర్వాత అవి కులం, మతం, ప్రాంతం, లింగం, శారీరక మానసిక బలహీనత, సైన్యం అనే రకరకాల పేర్లతో రిజర్వేషన్లను కల్పించడం, అందుకు అవసరమైన చట్ట సవరణలు చేయడం జరిగింది. రిజర్వేషన్లవల్ల చారిత్రాత్మకంగా లేక సామాజికంగా బలహీనపడిన వర్గాలకి అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. సమాజంలో అసమానతలను తగ్గించడం రిజర్వేషన్ల ఉద్దేశం. వాస్తవానికి రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించి అమలుచేయాలంటే మండల్ కమిషన్ తీర్పు, సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపరిచిన నిర్ణీత ప్రమాణాలను వెనుకబడిన వర్గాల కమిషన్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తాజా జనాభా గణాంకాల ఆధారంగా వాటిని పున:సమీక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తమిళనాడులో 69 శాతం, కర్నాటకలో 73 శాతం కోటా అమలులో ఉంది. ప్రభుత్వంలో, అన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాల్లో, అన్ని ప్రభుత్వ-ప్రైవేటు విద్యాసంస్థల్లో సరైన ప్రాతినిధ్యం లేని సామాజికంగా వెనుకబడిన తరగతులు, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలకు ఉపశమనం కలిగించేందుకు వారికి ఆయా సేవలు, సంస్థల్లో భారత ప్రభుత్వం కొన్ని పోస్టులను ప్రత్యేకించి కేటాయించే ఒక కోటా పద్ధతిని అందించడం జరుగుతుంది. మత, భాషా మైనార్టీ విద్యాసంస్థలు మాత్రం ఈ రిజర్వేషన్లు నుండి మినహాయించబడ్డాయి. భారత ప్రభుత్వం ఉన్నత విద్యలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది. రాష్ట్రాలు తమ శాసనాలతో మరింత ఎక్కువగా రిజర్వేషన్లు కల్పించుకునే వీలుంది. రాజస్థాన్ వంటి రాష్ట్రాలు 68 శాతం వరకూ రిజర్వేషన్లను ప్రతిపాదిస్తున్నాయి. తగిన ప్రాతినిధ్యం లేదని భావించే సమూహాలను గుర్తించేందుకు ప్రధానంగా కులాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం అలవాటులో ఉంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ కుటుంబ ఆరోగ్య, జాతీయ నమూనా అధ్యయనాలు సూచించిన విధంగా తక్కువ ప్రాతినిధ్యం చూసి రిజర్వేషన్లను కొనసాగిస్తున్నారు. తమిళనాడులో ముస్లింలకు, క్రైస్తవులకు 3.5 శాతం రిజర్వేషన్లను కల్పించింది. దీని కారణంగా ఒబిసి కోటాను 30 శాతం నుండి 23 శాతానికి తగ్గించింది. ఈ ఉపకోటాను సంబంధిత మత సమూహాలు వెనుకబడి ఉండటంవల్ల కల్పించడం జరిగిందే తప్ప మతం ఆధారంగా కల్పించలేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పాలనా యంత్రాంగం కూడా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే ఒక చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. అయితే దీన్ని కోర్టులో సవాలు చేశారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం అవసరమైతే ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణలో పరిణామాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. మత ప్రాతిపదిక రిజర్వేషన్లను అన్ని వర్గాలూ వ్యతిరేకిస్తున్నాయి. ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికగా రిజర్వేషన్లను కల్పించడాన్ని అన్ని వర్గాలూ సమర్థిస్తున్నాయి. ఈ అంశంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.