ఫోకస్

అవగాహన లేకే అనర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతుల సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన లేక అనర్థాలు జరుగుతున్నాయి. గత ఏడాది ప్రకృతి సహకరించి వర్షాలు కురవడంతో రైతులు గట్టెక్కారు. కానీ ప్రభుత్వం తామేదో ఘనకార్యం సాధించినట్లు చెప్పుకుంటోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాటలతో కడుపు నింపుతున్నారే తప్ప సాధించింది ఏమీ లేదు. ఎంత మంది రైతులకు రుణ మాఫీ (పూర్తిగా) చేశారో ప్రభుత్వాన్ని లెక్క చెప్పమనండి, వాస్తవాలు ఏమిటో బయటకు వస్తాయి. అవగాహన రాహిత్యంతో మిర్చి పంట వేయాలని చెప్పడంతో పత్తి పండించే రైతులు, ఇతర వాణిజ్య పంటలు వేసే రైతులు ఆ దిశగా వెళ్ళి చేతులు కాల్చుకున్నంత పనైంది. పండించిన మిర్చికి ధరలు లేక కళ్ళల్లో కారం పడినట్లు రోధిస్తూ అల్లాడుతున్నారు. టిఆర్‌ఎస్ కేవలం మాటల ప్రభుత్వం. ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే తెల్లారే సరికి ఎక్కడో చోట రైతన్న ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో చూస్తున్నాం. ప్రతి రోజూ ఏదో ఒక చోట రైతు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మా పార్టీ అధికారం చేపడితే రైతుల ఆత్మహత్యలే ఉండవన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు దీనికి ఏమని సమాధానం చెబుతారు. మీ గొప్పలు ఏమయ్యాయి?, రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి?. రైతన్నలను ఆదుకుని ఉంటే ఆత్మహత్యలు ఎందుకు జరిగేవి?.
మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో చెరువుల పూడిక తీయడం జరిగింది. చెరువుల పూడిక తీయడం అనేది నిరంతర ప్రక్రియ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, జరిగే ప్రక్రియనే. కానీ మేమే పూడికలు తీయించాం, అందుకే జలకళ అంటూ పెద్ద ప్రకటనలు ఇచ్చుకోవడం విస్మయం కలిగిస్తున్నది. శాశ్వత చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. అనేక నీటి పారుదల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు 90 శాతం పనులు పూర్తయితే, టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఆ 10 శాతం పనులు చేసి అంతా తామే చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నది. రైతుల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇకనైనా ముఖ్యమంత్రి కెసిఆర్ తన మాటలతో రైతుల కడుపులు నింపే ప్రయత్నం చేయకుండా వారి పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు అవకాశం ఉంటుంది. కేంద్రాన్ని కలిసి మిర్చి రైతులను ఆదుకోవాలని, న్యాయం చేయాలని కోరాలి. అవసరమైతే కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి.

-డి.కె. అరుణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టి.కాంగ్రెస్‌ః సీనియర్ నాయకురాలు